Soman Rana Wins Gold: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత అథ్లెట్లు చరిత్ర నెలకొల్పోతున్నారు. పురుషుల F57 షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లలో నిలిచి వన్-టూ పోడియం ఫినిష్ తో చరిత్ర తిరగరాసింది. భారత స్టార్ పారా అథ్లెట్ సోమన్ రానా పవర్ ఫుల్ త్రోతో స్వర్ణ పతకాన్ని (Gold) ముద్దాడగా, మరో భారత అథ్లెట్ శుభమ్ జుయల్ రజత పతకాన్ని (Silver) సొంతం చేసుకున్నాడు.
సీజన్ బెస్ట్ త్రోతో సోమన్ రానా రికార్డు:
2022 ఆసియా పారా గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ అయిన సోమన్ రానా, ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. తన సీజన్ బెస్ట్ 13.40 మీటర్లు గుండును విసిరి ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. తొలి నుంచి పోటీలో ఆధిపత్యం చెలాయించిన సోమన్, భారత్‌కు మరో ఐకానిక్ గోల్డ్ మెడల్‌ను అందించాడు.
రజతం దక్కించుకున్న శుభమ్ జుయల్:
సోమన్ రానాకు గట్టి పోటీ ఇస్తూనే మరో భారత అథ్లెట్ శుభమ్ జుయల్ మైండ్ బ్లాకింగ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. శుభమ్ కూడా తన సీజన్ బెస్ట్ 13.28 మీటర్లు విసిరి రెండవ స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కెమెరూన్‌కు చెందిన సెడ్రిక్ ఇద్రిస్ (12.57 మీటర్లు) కాంస్య పతకాన్ని (Bronze) గెలుచుకున్నాడు.
కామన్వెల్త్ వేదికపై భారత్ సత్తా:
ఒకే పారా అథ్లెటిక్ ఈవెంట్‌లో రెండు భారత త్రివర్ణ పతాకాలు పక్క పక్కనే అత్యున్నత స్థానాల్లో ఎగరడం ఇండియాకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. సోమన్ రానా, శుభమ్ జుయల్‌ల ఘన విజయంతో గ్లాస్గో వేదికగా భారత్ పతకాల జోరు మరింత పీక్స్‌కు చేరుకుంది. ఈ స్వర్ణం భారత్ ఖాతాలో చేరడంతో మొత్తం బంగారు పతకాల సంఖ్య 8కి చేరింది.
𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆: 𝐆𝐎𝐋𝐃 & 𝐒𝐈𝐋𝐕𝐄𝐑 𝐅𝐎𝐑 𝐈𝐍𝐃𝐈𝐀 𝐈𝐍 𝐏𝐀𝐑𝐀 𝐀𝐓𝐇𝐋𝐄𝐓𝐈𝐂𝐒 𝐀𝐓 𝐆𝐋𝐀𝐒𝐆𝐎𝐖 🔥🔥🔥
— India_AllSports (@India_AllSports) August 1, 2026
Soman Rana wins GOLD | Shubham Jayal wins Silver in Men's F57 Shotput #Glasgow2026 #Glasgow2026withIAS pic.twitter.com/vPi3PdjElJ
