బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా ముందువరసలో ఉంటారు. వీరిద్దరూ పంచుకునే ప్రతి పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అవుతుంటుంది. ఈ నేపథ్యంలో జూలై 31న కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల మోత మోగిపోయింది. ముఖ్యంగా కియారా భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన స్పెషల్ పోస్ట్ అభిమానుల మనసును గెలుచుకోవడమే కాకుండా నెట్టింట వైరల్గా మారింది.
కియారా పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ మల్హోత్రా అందమైన ఫొటోను షేర్ చేస్తూ, ‘‘నా ప్రతి రోజును తీపిగా మార్చే వ్యక్తికి హ్యాపీ బర్త్ డే’’ అంటూ ప్రేమతో కూడిన క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టుకు అభిమానులతో పాటు సినీ స్టార్స్ కూడా స్పందిస్తూ కియారాకు తమ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం వారి పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ, అభిమానులు మాత్రం ఈ జంటపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ, వారి అనుబంధాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Happy birthday to the one who makes every day a little sweeter…even when she’s stealing my ice cream ❤️😉 @advani_kiara pic.twitter.com/D2xyDhc5wK
— Sidharth Malhotra (@SidMalhotra) July 31, 2026
ప్రొఫెషన్ వేరు.. పర్సనల్ వేరు: ట్రోలర్లపై మండిపడ్డ ఫ్యాన్స్!
అయితే, ఈ హ్యాపీ మూమెంట్స్ సమయంలో కూడా కొందరు నెటిజన్లు అనవసర వివాదానికి తెరలేపారు. యశ్ హీరోగా వస్తున్న 'టాక్సిక్' సినిమాలో కియారా నటించిన కొన్ని సీన్స్‌ను ప్రస్తావిస్తూ ఆమెపై, సిద్ధార్థ్ పోస్ట్‌పై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై కియారా అభిమానులు, సాధారణ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "ఒక నటిగా తన ప్రొఫెషనల్ లైఫ్‌లో పాత్ర డిమాండ్ మేరకు నటించినంత మాత్రాన, పర్సనల్ లైఫ్‌లోకి వచ్చి ఇలా టార్గెట్ చేయడం అత్యంత నీచమైన చర్య. నటనను, వ్యక్తిగత జీవితాన్ని విడదీసి చూడలేకపోవడం నెటిజన్ల ముందస్తు మూఢత్వానికి నిదర్శనం" అంటూ ట్రోలర్ల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ALSO READ : వరుణ్ తేజ్ KoreanKanakaraju ట్రైలర్ రివ్యూ..
#Tabaahi - EXCELLENT SONG ✅️
— GetsCinema (@GetsCinema) July 8, 2026
Yash and Kiara Chemistry is at PEAK LEVEL 🔥🔥🔥🔥
Waiting to Watch their Chemistry in Entire #ToxicTheMovie One.
GetsCinema - Reached - HYPEMETER -92%pic.twitter.com/4eR0YfOtRN
నదియాగా కియారా.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్...
‘టాక్సిక్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది కియారా అద్వానీ. యశ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం జూలై 31న కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఇందులో తాను పోషిస్తున్న నాదియా పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌తో బర్త్ డే విషెస్ చెప్పారు.
Wishing a very Happy Birthday to our Nadia - @advani_kiara ✨️
— KVN Productions (@KvnProductions) July 31, 2026
–Team #Toxic#ToxicTheMovie#ToxicOn26thAug pic.twitter.com/1rPAa6eZpy
రెడ్ కలర్ కాస్ట్యూమ్స్‌లో ఆమె స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్‌లో యశ్, కియారా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. ఇంటిమేట్ సీన్స్ విషయంలో కొంత విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలపై ఇటీవల స్పందించిన కియారా.. సినిమా చూశాక ఆ నెగెటివిటీని పూర్తిగా మర్చిపోతారని, ఇందులోని ఉమెన్ క్యారెక్టర్స్ ఆ స్థాయిలో ఉంటాయని ఆమె క్లారిటీ ఇచ్చింది.
లేటెస్ట్ పోస్టర్‌లోనూ తన చూపుల్లోని ఇంటెన్సిటీ, బోల్డ్ రూబీ లిప్స్, రాయల్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్లామర్‌కే పరిమితం కాకుండా కాన్ఫిడెన్స్, మిస్టరీ దాగి ఉన్నట్టుగా అనిపిస్తోంది. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 26న సినిమా విడుదల కానుంది.
‘టాక్సిక్’ విశేషాలు..
భారీ అంచనాల మధ్య ‘టాక్సిక్’: గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’లో యశ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. యాక్షన్ అండ్ డార్క్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు, కియారా అద్వానీ క్యారెక్టర్ చాలా కొత్తగా, బోల్డ్‌గా ఉండబోతోందనే వార్తలు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వివాదం 'టాక్సిక్' సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతుండటం గమనార్హం. ప్రొఫెషనలిజమ్‌ను గౌరవించే సినీ ప్రియులు మాత్రం కియారా నటనను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
