V6 News

Jana Nayagan: సెన్సార్ కమిటీ ట్విస్ట్.. ‘జన నాయగన్’ రిలీజ్ మళ్లీ వాయిదా

Jana Nayagan: సెన్సార్ కమిటీ ట్విస్ట్.. ‘జన నాయగన్’ రిలీజ్ మళ్లీ వాయిదా

దళపతి విజయ్ నటించిన “జన నాయగన్” (Jana Nayagan) విడుదలపై సందిగ్ధత కొనసాగుతోనే ఉంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు కేసులు మూవీని చుట్టుముట్టడంతో.. ఆలస్యం అవుతూనే వస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన కట్స్, మార్పులకు చిత్రబృందం అంగీకరించినప్పటికీ కూడా సమస్య ఓ కొలిక్కి రావట్లేదు.

సెన్సార్ స్క్రీనింగ్ వాయిదా

లేటెస్ట్ సమాచారం ప్రకారం జన నాయగన్ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైన ఎడిట్స్ పూర్తి చేసి ఫైనల్ కట్ వెర్షన్‌ను సెన్సార్ రివ్యూ కమిటీకి పంపిన చిత్రబృందానికి అనుకోని షాక్ తగిలింది.

ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం సోమవారం మార్చి 9న CBFC రివైజ్ కమిటీ ముందు స్క్రీనింగ్ జరగాల్సి ఉంది. అయితే కమిటీలోని ఒక సభ్యుడు అనారోగ్యానికి గురవడంతో చివరి నిమిషంలో స్క్రీనింగ్ వాయిదా పడినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

►ALSO READ | Movie Review: ‘చరిత కామాక్షి’ ఓటీటీ రివ్యూ..

అంతేకాకుండా తదుపరి స్క్రీనింగ్ తేదీ కూడా ప్రకటించకపోవడంతో సినిమా విడుదలపై మరింత అనిశ్చితి నెలకొంది. అయితే, ఫిబ్రవరి 20నే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ, రివైజ్ కమిటీ స్క్రీనింగ్ పూర్తి కాకపోవడంతో ఆలస్యమైపోయింది. 

రిలీజ్ ఎప్పుడు?

తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, రివ్యూ కమిటీ సినిమా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తే వెంటనే అధికారిక విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల మూడు నెలలుగా వాయిదా పడుతోంది. మొదటగా నిర్మాతలు సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేయాలని భావించారు. కానీ వివాదాలు పరిష్కారం కాకపోవడంతో అది సాధ్యపడలేదు.

ఇప్పుడు అన్నీ అనుకూలంగా జరిగితే, విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతల ప్లాన్. అంటే, ఆయన బర్త్‌డే (జూన్ 22) కాగా.. మూడు రోజుల ముందుగానే జూన్ 18న జన నాయగన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లుగా టాక్. అయితే రివ్యూ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.