Movie Review: ‘చరిత కామాక్షి’ ఓటీటీ రివ్యూ.. ఎమోషనల్ స్టోరీతో వచ్చిన కొత్త మూవీ

Movie Review: ‘చరిత కామాక్షి’ ఓటీటీ రివ్యూ.. ఎమోషనల్ స్టోరీతో వచ్చిన కొత్త మూవీ

తెలుగు ఓటీటీలో ఓ కొత్త సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే ‘చరిత కామాక్షి’ (Charitha Kamakshi). చందు సాయి డైరెక్ట్ చేసిన ఈ మూవీ భార్యాభర్తల మధ్య ప్రేమ, కుటుంబ బంధాలు, జీవితంలో లక్ష్యాల కోసం పడే కష్టాలు వంటి భావోద్వేగ అంశాలతో ఈ సినిమాను హృదయానికి హత్తుకునేలా రూపొందించారు.

ఇందులో దివ్య శ్రీపాద, బిగ్ బాస్ ఫేమ్ అభయ్ నవీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ యాక్టర్ పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి, సునీత మనోహర్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 5, 2026న ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో  ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చి, ఎమోషనల్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నిజానికి ఈ మూవీ 2022లోనే థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సమయంలో రిలీజ్ కాలేదు. చివరికి దాదాపు నాలుగేళ్ల తర్వాత నేరుగా ఓటీటీలో విడుదలైంది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్, బలమైన సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది.

ALSO READ :  'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షోలపై సస్పెన్స్..

కథేంటంటే:

చరిత (దివ్య శ్రీపాద) ఒక ఇన్నోసెంట్ అమ్మాయి. ప్యాషనేట్ ఫిల్మ్‌‌మేకర్ చక్రవర్తి (నవీన్ బేతిగంటి)ని పెండ్లి చేసుకుంటుంది. లైఫ్ హాయిగా సాగిపోతుంటుంది. అప్పుడే అనుకోకుండా చక్రవర్తి ఓ కేసులో ఇరుక్కుంటాడు. ఇన్​స్పెక్టర్ (పృథ్వీరాజ్) అతన్ని కేసు నుంచి తప్పించడానికి చరితకు ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి? చరిత దానికి ఒప్పుకుందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే:

ఈ సినిమా బలమైన ఎమోషన్స్‌తో సాగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నమ్మకం, త్యాగం వంటి భావోద్వేగాలను దర్శకుడు చక్కగా చూపించాడు. కథ నెమ్మదిగా ముందుకు సాగినా కొన్ని సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి. దివ్య శ్రీపాద తన పాత్రలో సహజంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిల్మ్‌మేకర్ పాత్రలో అభయ్ నవీన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

పృథ్వీరాజ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో కథకు కీలకంగా నిలిచాడు. ఓవరాల్గా ఇందులోని మెయిన్ క్యారెక్టర్స్ పోషించిన వారి నటన సహజంగా ఉండటం సినిమాకు మరింత బలం ఇచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టపడే వారికి ‘చరిత కామాక్షి’ ఓ మంచి ఓటీటీ వాచ్‌గా అనిపిస్తుంది.