కరెంట్ పోల్ దగ్గర షార్ట్ సర్క్యూట్.. పక్కనే ఉన్న టిప్పర్ కాలి బూడిద

కరెంట్ పోల్ దగ్గర షార్ట్ సర్క్యూట్.. పక్కనే ఉన్న టిప్పర్ కాలి బూడిద

నల్గొండ: నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో ప్రమాదం జరిగింది. రోడ్డు విస్తరణ పనుల్లో ఉన్న టిప్పర్ కరెంట్ వైర్ తెగిపడటంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల్లో కాలిపోయింది. టిప్పర్ నిలిపి ఉంచిన ప్రదేశంలో ట్రాన్స్  ఫార్మర్, కరెంట్ పోల్ ఉంది. ఆ కరెంట్ పోల్పై నుంచి వైర్ తెగిపడి టిప్పర్పై పడటంతో మంటలు రేగాయి.

ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ కు కరెంట్ షాక్ కారణంగా తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఎండా కాలం కావడం వల్ల మంటలు మరింత త్వరగా టిప్పర్ మొత్తం అంటుకున్నాయి. మంటలు, పొగలు పెద్ద ఎత్తున గాల్లోకి లేచాయి. మంటల్లో టిప్పర్ తగలబడుతున్న దృశ్యాలు గ్రామస్తులను కలవరపాటుకు గురిచేశాయి.

►ALSO READ | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నిమిషాల్లోనే ఇల్లంతా ధ్వంసం

మంచిర్యాల జిల్లాలో కూడా కరెంట్ షాక్ ఇద్దరిని బలి తీసుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో కరెంట్ షాక్ తో ఇద్దరు చనిపోయారు. ఒకరు.. మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ( ఎడ్డన్న) కాసీపేట గ్రామానికి చెందిన నాగరాజు కరెంట్ మెయిన్ లైన్కు స్టాండ్ తగలడంతో మృతి చెందాడు. పెట్రోల్ బంక్ పక్కనే హార్డ్ వేర్ షాప్లో పనిచేస్తున్న వర్కర్.. పెట్రోల్ బంక్లో ఉన్న  స్టాండ్ను తీసుకు వెళ్తుండగా విద్యుత్ మెయిన్ లైన్కు స్టాండు తగలడంతో విద్యుత్ షాక్ కారణంగా ఆ వర్కర్ ప్రాణం పోయింది.