Tea Cup Troll: పాకిస్తాన్ ని ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్ చక్రవర్తి.. నెట్టింట ఫన్నీ కామెంట్స్

Tea Cup Troll: పాకిస్తాన్ ని ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్ చక్రవర్తి.. నెట్టింట ఫన్నీ కామెంట్స్

Tea Cup Troll: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించి భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని  గెలిచింది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 255/5 స్కోరు నమోదు చేసింది. సంజూ శర్మన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సగటు సెంచరీలు కొట్టడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ కేవలం 159 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచిన టీమ్ గా నిలిచింది.  

ఇండియన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మళ్లీ పాకిస్తాన్ పై ఫన్నీ డిగ్ చేశాడు. విజయోత్సవాల సందర్భంగా చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫన్నీ ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఆయన ట్రోఫీను పట్టుకొని, టీ కప్‌లో టీ తాగుతూ కనిపించారు. ఈ పోస్టు వైరల్ కావడంతో.. సోషల్ మీడియాలో అభిమానులు ఫన్నీ కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు. అయితే 2021లో కూడా పాక్ తో హ్యుమరస్ స్టాండ్ తీసుకున్నాడు వరుణ్. ఆ సమయంలో, ఇండియా ఆటగాళ్లు ఆసియా కప్ 2025 ఫైనల్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోలేదని, అందుకే ఫోటో కోసం కప్ స్థానంలో టీ కప్ ఉపయోగించారు. 

ALSO READ : ఇదేం ఘోరం రా అయ్యా..

ఆసియా కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత నా పక్కన కేవలం కాఫీ కప్ మాత్రమే ఉంది కాబట్టి, ఆ ఫోటో కోసం అదే ఉపయోగించాను అని టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. ఇక సోషల్ మీడియాలో వరుణ్ చక్రవర్తి ఫోటోకి నెటిజన్స్ చేసే కామెంట్లు తెగ నవ్వించేస్తున్నాయి. వాళ్లు చేసిన మోసం, ఇప్పుడు వాళ్లే అనుభవిస్తున్నారంటూ  అభిమానులు పోస్టులు పెడుతున్నారు.  టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో వరుణ్ చక్రవర్తి మొత్తం 14 వికెట్లు పడేసి జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు.