
తెలంగాణ సింగర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్ధం చేసుకున్నారు. ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సింగర్గా ఉన్న రాహుల్.. త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. చాలా కాలంగా ప్రేమిస్తున్న తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం.
ఆదివారం రాత్రి (ఆగస్ట్ 17న) హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో రాహుల్ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ విషయంపై రాహుల్ నుంచి అధికారిక ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. అయితే, ఎంగేజ్‌మెంట్‌కి హాజరైన అతిథులు, సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతలోనే, రాహుల్కు కాబోయే భార్య హరిణ్య రెడ్డి ఎవరనే విషయంలో, ఆయన అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం హరిణ్య రెడ్డి ఇన్‌స్టా ప్రొఫైల్ మాత్రం లాక్‌లో ఉంది. అయితే, ఆమెకి 15.6Kమంది ఫాలోవర్స్ ఉండగా.. రాహుల్ సిప్లిగంగ్ ఆమెను ఫాలో అవుతుండటం ఆసక్తిగా మారింది.
►ALSO READ | Coolie vs War 2: కూలీ, వార్ 2 బాక్సాఫీస్ అప్డేట్.. నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
అంతేకాకుండా.. యాంకర్ స్రవంతి చొక్కారపు, సింగర్ నోయల్, యాంకర్ విష్ణుప్రియ, వీజే సన్నీ, సుప్రిత, అరియానా, సింగర్ గీతా మాధురి, జబర్దస్త్ రోహిణి ఇలా పలువురు సెలబ్రెటీలు హరిణ్యను ఫాలో అవుతున్నారు. దాంతో హరిణ్య కూడా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి అయి ఉంటుందని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. చూడాలి మరి రాహుల్ ఎప్పుడు స్పందిస్తాడో!
ఇటీవలే, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల చెక్ అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో చెక్కును అందజేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో పాడిన నాటు నాటు పాట ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.