Coolie vs War 2: కూలీ, వార్ 2 బాక్సాఫీస్ అప్డేట్.. నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Coolie vs  War 2: కూలీ, వార్ 2 బాక్సాఫీస్ అప్డేట్.. నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గురువారం (ఆగస్ట్ 14న) రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. రజినీకాంత్  కూలీతో పాటు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు తమ వసూళ్ల దూకుడిని తగ్గించాయి. అయితే, మొదటి 4 రోజుల్లో మాత్రం తగ్గేదేలే అన్నమాదిరిగా కలెక్షన్స్ సాధించాయి. కూలీ విడుదలైన మొదటి మూడు రోజుల్లో భారతదేశంలో రూ.158.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. పలు రికార్డులు సొంతం చేసుకుంది. 

ట్రేడ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం:

కూలీ మొదటి 4 రోజులు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.193.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల మార్కును చేరుకోవడానికి దగ్గరగా ఉంది. ఆదివారం (ఆగస్ట్ 17) నాడు మొత్తం రూ.34కోట్ల వసూళ్లు రాబట్టింది. అందులో తమిళంలో రూ.22.5కోట్లు, హిందీలో రూ.4.65కోట్లు, తెలుగులో రూ.6.5 కోట్లు కలెక్ట్ చేసింది.

అయితే, నాలుగోవ రోజైన ఆదివారం రూ.34కోట్ల నెట్ వసూళ్లు చేసింది. కానీ, శనివారంతో (రూ.39.5 కోట్లు) పోలిస్తే సుమారు 5 కోట్ల నెట్ తక్కువ కలెక్ట్ చేసింది. ఈ క్రమంలో.. ఇవాళ 5వ రోజైన మొదటి సోమవారం రూ.200 కోట్ల నెట్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది.

ఇలా ఓవరాల్గా నాలుగు రోజుల్లో.. కూలీ మూవీ ప్రపంచవ్యాప్త రూ.375 కోట్ల గ్రాస్, రూ.193.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఫస్ట్ వీకెండ్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రంగా కూలీ రికార్డు నెలకొల్పింది. లియో నాలుగు రోజుల్లో రూ.370 కోట్ల రికార్డును కూలీ బద్దలుకొట్టింది.

వార్ 2 నాలుగు రోజుల విషయానికి వస్తే.. 

వార్ 2 మూవీ కూలీ కంటే ఎక్కువ థియేటర్లలో రిలీజైనప్పటికీ.. వసూళ్ల పరంగా వార్ 2 వెనుకబడి ఉంది. వార్ 2 నాలుగు రోజుల్లో ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.173 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కూలీ మూవీ మాత్రం ఇప్పటికే రూ.190 కోట్లు దాటి, నేడు రూ. 200 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును చేరుకోనుంది. అలాగే, ఓవర్సీస్ కలెక్షన్ వార్ 2 ($5 మిలియన్లు) కూలీ ($16 మిలియన్లు)గా ఉంది.

►ALSO READ | డోంట్ మిస్: సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందా..? 24 విభాగాల టెక్నీషియన్లకు అద్భుత అవకాశం

వార్ 2 విడుదలైన రోజు (ఆగస్ట్ 14న) ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.52 కోట్లు (నెట్) సాధించింది. శుక్రవారం రూ. 57.35 కోట్లకు పెరిగింది, ఆ తర్వాత శనివారం రూ. 33.25 కోట్లు, ఆదివారం రోజు రూ.31కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇకపోతే, వార్ 2 ఇండియా వైడ్గా నాలుగురోజుల్లో హిందీలో మొత్తం రూ.123 కోట్ల నెట్ సాధించింది. కేవలం ఆదివారం ఒక్కరోజే హిందీలో రూ.25 కోట్లు నెట్ వసూలు చేసినట్లు నిపుణుల అంచనా చెబుతున్నాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతనేది తెలియాల్సి ఉంది.