డోంట్ మిస్: సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందా..? 24 విభాగాల టెక్నీషియన్లకు అద్భుత అవకాశం

డోంట్ మిస్: సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందా..? 24 విభాగాల టెక్నీషియన్లకు అద్భుత అవకాశం

AK ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఈ రియాల్టీ షో ద్వారా అవకాశాలు కల్పించనున్నారు. ‘షో టైం’సినిమా తీద్దాం రండి అనే ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌తో ఈ షోను తీర్చిదిద్దారు.

ఈ  సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో అనిల్ సుంకర మాట్లాడుతూ ‘సినిమాలపై ఆసక్తి ఉన్న వారికి ఇదొక సదావకాశం. సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధంగా ఈ షోను తీసుకురాబోతున్నాం.

మొత్తం 16 స్ర్కిప్టులను ఎంపిక చేసుకొని అందులో 4 బెస్ట్ స్ర్కిప్ట్‌‌‌‌లను 12 మంది జడ్జీలు ఫైనల్ చేస్తారు. ఆ స్క్రిప్ట్స్‌‌‌‌పై ఆసక్తి ఉన్న నిర్మాతలు బిడ్డింగ్ చేసి ఒక కోటి రూపాయలలో కేవలం 30 రోజులలోనే సినిమా పూర్తి చేసేలా ప్రణాళికలు వేస్తున్నాం. ఈ షో ప్రముఖ ఓటీటీలో ఇంటర్నేషనల్ వైడ్‌‌‌‌గా స్ట్రీమింగ్ అవనుంది’అని తెలియజేశారు.

►ALSO READ | Halagali Glimps: చరిత్రలో నిలిచిపోయే ‘హలగలి’.. డాలీ ధనంజయ భారీ హిస్టారికల్ మూవీ