
కన్నడ నటుడు డాలీ ధనంజయ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హలగలి’. సప్తమి గౌడ హీరోయిన్. సుకేష్ నాయక్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ల నిర్మిస్తున్నారు. ఈ హిస్టారికల్ డ్రామాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా గ్లింప్స్ విడుదల చేసిన సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ధనంజయ మాట్లాడుతూ ‘ఇదొక అన్ టోల్డ్ స్టోరీ. కర్నాటకలో గ్రేట్ ఎమోషన్. అందరి అంచనాలను అందుకుంటూ ప్రేక్షకులకు గొప్ప ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది’అని చెప్పాడు.
సప్తమి గౌడ మాట్లాడుతూ ‘ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన చాప్టర్. ఇందులో మాస్ క్యారెక్టర్ చేశా’అని చెప్పింది. దర్శకుడు సుకేష్ మాట్లాడుతూ ‘ఒక భాగంగా చెప్పే కథ కాదు ఇది. ఈ కథ వెనక ఓ గొప్ప చరిత్ర ఉంది. అందుకే రెండు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే నలభై శాతం చిత్రీకరణ పూర్తయింది’అన్నారు.
నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ‘హలగలి చరిత్రలో ఒక అధ్యాయం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హలగలి ప్రజలు చేసిన పోరాటం చిరస్మరణీయం. దీన్ని తెరపై విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నాం’అని అన్నారు.