కుమ్రంభీమ్ జిల్లాలో ఆవుదూడపై పంజా విసిరిన పెద్దపులి.. భయాందోళనలో ప్రజలు

కుమ్రంభీమ్ జిల్లాలో ఆవుదూడపై పంజా విసిరిన పెద్దపులి.. భయాందోళనలో ప్రజలు

కుమ్రంభీమ్ జిల్లాలో పెద్దపులి వార్త కలకలం రేపింది. లేగదూడపై దాడి చేసి చంపేసిందనే సమాచారంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు అలర్ట్ అయ్యారు. 

సోమవారం (ఆగస్టు 18) పెద్దపులి లేగదూడపై దాడి చేసి చంపేసింది. కుమ్రంబీమ్  జిల్లా సిర్పూర్ టి  మండలం  చీలపల్లి  అటవీ ప్రాంతంలో పెద్దపులి   ఆవు దూడ పై  పంజా విసిరింది.  పులి దాడిలో ప్రాణాలు కోల్పోయింది దూడ. పెద్ద పులి వార్త తెలిసిన పశువుల కాపరులు ఆటవీ  ప్రాంతానికి వెళ్లాలంటే జంకుతున్నారు. 

ఫారెస్ట్ అధికారులు పెద్దపులి తిరుగున్న ప్రాంతాన్ని పరిశీలించారు. లేగదూడను చంపిన ప్రదేశంలోకి వెళ్లారు. అప్పటి దారా అక్కడే ఉన్న పులి.. ఫారెస్ట్ ఆఫీసర్ల సఫారీ వెనుక దర్జాగా నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. అయితే పులి అదే ప్రాంతంలో తిరుగుతుండటంతదో  పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఆటవీ అధికారులు.