నస్పూర్, వెలుగు: మంచిర్యాల పట్టణంలోని ఐటీఐ క్యాపస్‌లో ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ శృతి గోలి హాస్పిటల్ లో రిసెప్షనిస్ట్(3), డాటా ఎంట్రీ ఆపరేటర్(3), స్టాఫ్ నర్సింగ్ ఇన్చార్జ్(5), ఫార్మాసిస్ట్(3), సిస్టం ఆపరేటర్(2), స్కావెంజర్(4) కోసం మంగళవారం ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారని తెలిపారు. డిగ్రీ, ఏఎన్ఎం, ఎసెస్సీ పూర్తి చేసినవారు అర్హులని, పూర్తి వివరాల కోసం 9959607008, 8333059029 నంబర్లలో సంప్రదించాలన్నారు.
