కాగజ్‌నగర్ లో రూ.17 లక్షల మోసం కేసులో వ్యక్తి రిమాండ్ : ఎస్సై సందీప్ కుమార్

కాగజ్‌నగర్ లో  రూ.17 లక్షల మోసం కేసులో వ్యక్తి రిమాండ్ : ఎస్సై సందీప్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: భూమి అమ్మకంలో మధ్యవర్తిగా ఉండి రూ.17 లక్షలు తీసుకుని మోగించిన వ్యకికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.కౌటాల మండలం బోదంపల్లికి చెందిన రామటెంకి ప్రకాశ్​తనకు కాగజ్ నగర్ మండలం మాలిని గ్రామ శివారులో ఐదెకరాల పట్టా భూమి ఉందని కాగజ్‌నగర్‌కు చెందిన కృష్ణ అనే వ్యక్తిని నమ్మించి అతడి వద్ద నుంచి రూ.17 లక్షలు తీసుకున్నాడు. 

అయితే ఆ తర్వాత తాను ఇచ్చిన డబ్బులకు భూమి చూపాలని కృష్ణ అడిగితే ప్రకాశ్​ బెదిరింపులకు దిగాడు. దీనిపై బాధితుడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా,  విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశ్ మోసం చేసినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి  ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.