జూరాలకు పోటెత్తిన భారీ వరద.. 31 గేట్లు ఓపెన్

జూరాలకు పోటెత్తిన భారీ వరద.. 31 గేట్లు ఓపెన్

హైదరాబాద్: జురాల ప్రాజెక్ట్‎కు వరద పొటెత్తింది. సోమవారం (ఆగస్ట్ 18) సాయంత్రం నుంచి వరద ఉధృతంగా వస్తుండటంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేశారు. 31 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2,13,000 వేల క్యూ సెక్కులు వస్తుండగా..  2,42,752 వేల క్యూ సెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని.. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు.  

నాగార్జున సాగర్ గేట్లన్నీ ఓపెన్:

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు కూడా వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో అధికారులు నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్ ఫ్లో 3,70, 308 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 3,45, 317 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 585.70 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 299.45 టీఎంసీలుగా ఉంది.