700 ఫైటర్ జెట్స్.. వెయ్యి టార్గెట్స్.. 3 వేల బాంబులు.. 30 గంటలు.. ఇరాన్ విధ్వంసం ఇలా..

700 ఫైటర్ జెట్స్.. వెయ్యి టార్గెట్స్.. 3 వేల బాంబులు.. 30 గంటలు.. ఇరాన్ విధ్వంసం ఇలా..

యుద్ధం అలా ఇలా జరగటం లేదు.. అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు.. ఇరాన్ దేశంపై విరుచుకుపడుతున్నాయి. అక్కడా ఇక్కడా అని తేడా లేదు.. ఇరాన్ దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. అంతర్జాయతీ నిపుణులు.. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన డేటా ప్రకారం.. ఇరాన్ లో విధ్వంసం చాలా ఎక్కువగా ఉందని.. జనం వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయానేది ఇప్పుడు బయటకు వస్తున్న లెక్కలు.

* ఇరాన్పై.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయంటూ డేటాను రిలీజ్ చేస్తున్నారు. 
* జస్ట్ 30 అంటే 30 గంటల్లోనే.. ఇరాన్ దేశంపై వెయ్యి చోట్ల బాంబులు దాడులు జరిగాయి. 
* ఇరాన్ దేశంలోని వెయ్యి ప్రాంతాలను టార్గెట్ చేసుకుని 2 వేలకు పైగా శక్తివంతమైన బాంబులు వేసింది ఇజ్రాయెల్, అమెరికా. 
* 2 వేల బాంబులతోపాటు వేల సంఖ్యలో డ్రోన్ బాంబులు వేశారు ఆ రెండు దేశాలు. 
* ఇక ఇరాన్ గగనతలంపై 700 ఫైటర్ జెట్స్ చక్కర్లు కొట్టాయని.. ఈ 700 ఫైటర్ జెట్స్.. వెయ్యి ప్రాంతాల్లో.. 2 వేలకు పైగా బాంబులు వేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇరాన్లో జరిగిన వెయ్యి ప్రాంతాల్లో దాడుల్లో ఇరాన్ సుప్రీం ఖమేనీతో పాటు 200 మంది చనిపోయారని.. 750 మంది గాయపడ్డారని అధికారికంగా చెబుతున్నా.. ఈ సంఖ్య రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్క స్కూల్ పైనే పడిన బాంబుల వల్లే 180 మంది పిల్లలు చనిపోయారని.. ఇరాన్ లో మరణాల సంఖ్యపై స్పష్టత లేదని.. లెక్కలు బయటకు రావటం లేదని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. 

ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీపై మరిన్ని దాడులు జరుగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించటంతో.. యుద్ధం తీవ్ర స్థాయికి.. ఇరాన్ దేశం నేల మట్టం ఖాయం అన్న వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దాడుల్లో ఇరాన్ లో విధ్వంసం ఖాయంగా స్పష్టం అయ్యిందని.. ఇరాన్ దేశాన్ని కోలుకోలేని విధంగా ఈసారి దాడులు ఉండొచ్చని క్లారిటీకి వస్తున్నాయి మిగతా దేశాలు. మరో నెల, రెండు నెలలు యుద్ధం జరిగే సూచనలు ఉన్నాయనేది అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు.