Suriya 46 Title: సూర్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. మరో పవర్‌ఫుల్ స్టోరీతో లక్కీ భాస్కర్ డైరెక్టర్

Suriya 46 Title: సూర్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. మరో పవర్‌ఫుల్ స్టోరీతో లక్కీ భాస్కర్ డైరెక్టర్

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు సూర్య (Suriya). ఇన్నాళ్లు తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేస్తూ విశేష అభిమానాన్ని సొంత చేసుకున్న సూర్య.. ఇపుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నారు. సూర్య కెరీర్‌లో ఇది 46వ చిత్రం కాగా, తెలుగు–తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.

ఇవాళ సోమవారం (మార్చి 2న) సూర్య-వెంకీల మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ (VishwanathAndSons) అనే ఆసక్తికరమైన టైటిల్‌‌ ప్రకటిస్తూ అంచనాలు పెంచారు.

“అతని సమక్షంలో శక్తి.. అతని కౌగిలిలో వెచ్చదనం. హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాతో వెంకీ-అట్లూరి సినిమా వస్తోంది. పాతకాలపు మాయాజాలాన్ని విశ్వనాథన్ అండ్ సన్స్ తిరిగి తీసుకువస్తోంది. 2026లో బెస్ట్ & బిగ్గెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీ అవుతుంది. ఈ జూలైలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అని నిర్మాణ సంస్థ సితార ట్వీట్ చేసింది.

ఈ సినిమా కథాంశం ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి మరియు ఒక యువతి మధ్య సంబంధం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే 24 ఏళ్ల యంగ్ బ్యూటీ మమిత బైజుని, 50 ఏళ్ల సూర్య సరసన ఎంపిక చేశారు. ‘ప్రేమలు’ సినిమా ద్వారా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న మమితకు ఇది భారీ అవకాశం. 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తుండగా, రాధిక శరత్ కుమార్, భవానీ శ్రీ, మరియు బ్జోర్న్ సుర్రావ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమాను (జూలై) సమ్మర్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డేట్ మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.