హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తూ.. ముందున్న డీసీఎంను ఢీకొట్టిన కారు పల్టీ కొడుతూ డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సోమవారం ( మార్చి 2 ) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఎల్బీ నగర్ సాగర్ రింగు రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తూ ముందున్న డీసీఎంను ఢీకొట్టిన కారు పల్టీ కొట్టి డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి.
కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో ఉన్న డ్రైవర్ సాయి కీర్తన్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ను ఎల్బినగర్ కామినేని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. మంటల దాటికి కారు పూర్తిగా దగ్దమైంది.
కారు డ్రైవర్ సాయికీర్తన్ ఎల్బీ నగర్ రాక్ టౌన్ కి చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్దారించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
