ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ.. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా మిలిటెంట్ల దాడి

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ.. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా మిలిటెంట్ల దాడి

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇరాన్ మిత్ర దేశం లెబనాన్ ఎంట్రీ ఇచ్చింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఈ దాడులకు బదులిస్తూ.. లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ల ఏరివేతనే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ సోమవారం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇరానియన్ టార్గెట్లను కూల్చేయడమే లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ మిలటరీ కొన్ని వారాల పాటు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పేశారు.

ట్రంప్ ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే లెబనాన్ను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం గమనార్హం. ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు కూడా ఇరాన్కు మద్దతుగా నిలవడంతో యుద్ధం మరింత ముదిరింది. సదరన్ లెబనాన్, ఉత్తర లెబనాన్ లోని 50 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సూచించింది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా గ్రూప్ దాడి చేసింది. నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా టార్గెట్గా హిజ్బుల్లా తీవ్రవాదులు దాడులు చేశారు. ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులే లక్ష్యంగా అటాక్ చేసింది. 2024లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఖమేనీ మృతి తర్వాత ఈ ఒప్పందాన్ని గాలికొదిలేసి మళ్లీ ఈ రెండు దేశలు దాడులు చేసుకుంటున్నాయి.