చరిత్ర సృష్టించిన జమ్మూకాశ్మీర్: 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి విజేత!

చరిత్ర సృష్టించిన జమ్మూకాశ్మీర్: 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి  విజేత!

దేశవాళీ క్రికెట్ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ విజేతగా నిలిచి జమ్మూకాశ్మీర్ సంచలనం సృష్టించింది. సుమారు 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో (మొదటి టోర్నీ 1934లో ప్రారంభమైంది) జమ్మూకాశ్మీర్ జట్టు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. హుబ్బళిలో కర్ణాటకతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూకాశ్మీర్ జట్టు విజయం సాధించింది. 

తొలి ఇన్నింగ్స్​లో లభించిన 291 పరుగుల భారీ ఆధిక్యం ఆధారంగా జమ్మూకాశ్మీర్‌ను విజేతగా ప్రకటించారు. అద్భుత ప్రదర్శన చేసిన జమ్మూకాశ్మీర్ ఆటగాడు శుభమ్ పుందిర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకిబ్ నబి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా ఎంపికయ్యాడు. ఈ సీజన్‌లో మొత్తం 60 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లో 245 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.