ఈసీఐఎల్ లో నటి ప్రియాంక మోహన్ సందడి..కిసాన్ ఫ్యాషన్ మాల్ ప్రారంభం, హాజరైన ప్రముఖులు

ఈసీఐఎల్ లో నటి ప్రియాంక మోహన్ సందడి..కిసాన్ ఫ్యాషన్ మాల్ ప్రారంభం, హాజరైన ప్రముఖులు

మల్కాజిగిరి,  వెలుగు :  హైదరాబాద్ పరిధిలోని ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డులో ఏర్పాటు చేసిన కిసాన్ ష్యాషన్ మాల్ ను శుక్రవారం సినీ నటి ప్రియాంక మోహన్ ప్రారంభించారు. కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌‌పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే ఎన్‌‌వీఎస్‌‌ఎస్ ప్రభాకర్, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి హాజరయ్యారు.

 అనంతరం ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరలకు అందించడమే సంస్థ విజయ రహస్యమని చెప్పారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు వ్యాపార వృద్ధికి ఇలాంటి సంస్థలు తోడ్పడతాయన్నారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా 24, 25, 26 తేదీల్లో ప్రత్యేక ఆఫర్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ బంపర్ డ్రా నిర్వహించి విజేతలకు హోండా యాక్టివా స్కూటర్లను ఇస్తామని చెప్పారు. నటిని చూసేందుకు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.