కొల్లాపూర్, /కోడేరు(పెద్దకొత్తపల్లి), వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, తప్పుల్లేకుండా వేగంగా పూర్తి చేయడానికి బీఎల్ఏలు, బీఎల్వోలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో సర్ ప్రక్రియను పరిశీలించి అధికారులతో ఆయన సమీక్షించారు. ఇన్యుమరేషన్ ఫారాల స్వీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించినందున, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా హెల్ప్ డెస్క్ లు, ఫోన్ కాల్స్ ద్వారా వివరాలు సేకరించాలని సూచించారు.
ఇదే సమయంలో కోడేరు మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా, సింగోటం సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడి ఉన్న కావలి మల్లేశ్అనే వ్యక్తిని చూసి స్పందించిన మంత్రి జూపల్లి, తన కాన్వాయ్‌లోని వాహనంలో అతడిని కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేలా చర్యలు తీసుకుని తన మానవత్వాన్ని చాటుకున్నారు.
