హైదరాబాద్ బండ్లగూడ పబ్లిక్ కు అలర్ట్... ఇవాళ ( ఆగస్టు 29 ) నీళ్లు బంద్.. మళ్ళీ వచ్చేది ఎప్పుడంటే..!

హైదరాబాద్ బండ్లగూడ పబ్లిక్ కు అలర్ట్... ఇవాళ ( ఆగస్టు 29 ) నీళ్లు బంద్.. మళ్ళీ వచ్చేది ఎప్పుడంటే..!

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: నగరంలోని బండ్లగూడ ఎక్స్‌‌‌‌రోడ్‌‌‌‌ వద్ద బాక్స్‌‌‌‌ డ్రెయిన్‌‌‌‌ నిర్మాణ పనులకు అనుకూలంగా కృష్ణా డ్రింకింగ్‌‌‌‌ వాటర్‌‌‌‌ సప్లై ప్రాజెక్ట్‌‌‌‌ ఫేజ్‌‌‌‌–3 గ్రావిటీ మెయిన్‌‌‌‌పై జంక్షన్‌‌‌‌ పనులు చేపట్టనున్నారు. బాక్స్‌‌‌‌ డ్రెయిన్‌‌‌‌ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌లో ప్రధాన పైప్‌‌‌‌లైన్‌‌‌‌ ఉండటంతో ఈ పనులు చేపడుతున్నట్లు మెట్రోవాటర్‌‌‌‌ బోర్డు అధికారులు తెలిపారు. 

ఈ నెల 29న శనివారం ఉదయం 10 గంటల నుంచి 30న ఆదివారం ఉదయం 10 గంటల వరకు పనులు కొనసాగుతాయి. దీంతో 24 గంటలపాటు కృష్ణా ఫేజ్‌‌‌‌–3, రింగ్‌‌‌‌ మెయిన్‌‌‌‌–1 పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రాంతాలకు బంద్​..

శాస్త్రిపురం, బండ్లగూడ, శంషా బాద్‌‌‌‌, మధుబన్‌‌‌‌, దుర్గానగర్‌‌‌‌, సులేమాన్‌‌‌‌ నగర్‌‌‌‌, పీడీపీ, గోల్డెన్‌‌‌‌ హైట్స్‌‌‌‌, అత్తాపూర్‌‌‌‌, కిస్మత్‌‌‌‌పూర్‌‌‌‌, 9 నంబర్‌‌‌‌, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, ప్రశాసన్‌‌‌‌ నగర్‌‌‌‌, జూబ్లీహిల్స్‌‌‌‌, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్‌‌‌‌, షేక్‌‌‌‌పేట్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది.