104 మద్యం బాటిళ్ల పట్టివేత.. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్

104 మద్యం బాటిళ్ల పట్టివేత.. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఢిల్లీ, గోవా నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టు ద్వారా తరలిస్తున్న ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్​ను శుక్రవారం ఎస్టీఎఫ్​సీ టీం పట్టుకుంది. సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజు సిబ్బంది కలిసి ఎయిర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకి సమీపంలో ఉన్న పహాడ్ షరీఫ్ వద్ద వెహికల్స్ తనిఖీలు చేపట్టగా, 104 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ దొరికింది. దీంతో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 2 లక్షల పైనే ఉంటుందని అంచనా.