అప్​గ్రేడ్ కాని టీఎస్–బీపాస్ సేవలు

అప్​గ్రేడ్ కాని టీఎస్–బీపాస్ సేవలు
  • రీఫండ్, ఎడిట్ ఆఫ్షన్లు లేక నిర్మాణదారులకు ఇబ్బందులు
  • తప్పులు కారణంగా రిజెక్ట్​అవుతున్న అప్లికేషన్లు

నాగారం మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తి బిల్డింగ్ పర్మిషన్ కోసం టీఎస్–బీపాస్​లో అప్లయ్ చేసుకున్నాడు. ఆ వెంటనే ఆప్షన్లు అన్ని పూర్తి చేయగా.. ఫీజు ఇంటిమెషన్ మెసేజ్ వచ్చింది. ఆన్​లైన్​ద్వారా పేమెంట్ చేశాడు. మరుసటి రోజున అప్లికేషన్ స్టేటస్ క్లోజ్డ్​గా చూపించింది. దీంతో సంబంధిత మున్సిపల్ ఆఫీసర్ల వద్దకు వెళ్లి అడగగా టీఎస్ బీపాస్​ను ఆశ్రయించాలనే సమాధానం వచ్చింది. విషయాన్ని టెక్నికల్ టీం దృష్టికి తీసుకెళ్లగా15 రోజులైనా రీఫండ్​పై ఎలాంటి సమాచారం దొరకలేదు. 

ఓల్డ్ సిటీకి చెందిన జావెద్ అలీ బిల్డింగ్ పర్మిషన్ కోసం టీఎస్ బీపాస్ లో అప్లై చేసుకున్నాడు. ఆఫీసర్లు చెప్పినట్లుగానే ఆన్ లైన్ లో ఫీజు చెల్లించడంతో అక్నాలెడ్జ్ మెంట్ నంబర్ జనరేట్ అయ్యింది. అయితే బిల్డింగ్ లో మార్పుల కోసం అప్లికేషన్​లో చేంజ్ చేసుకునేందుకు టీఎస్​బీపాస్​లో వెతకగా ఆ సౌకర్యం కనిపించలేదు. ఎడిట్ ఆప్షన్ కోసం అధికారులను ఆశ్రయించగా, ఫీజు చెల్లించిన తర్వాత ఎడిట్ ఫీచర్ ఉండదంటూ సమాధానం వచ్చింది.

హైదరాబాద్, వెలుగు:బిల్డింగ్ నిర్మాణ అనుమతులు పొందేందుకు ఈజీగా అప్లై చేసుకునేలా, ఆఫీసర్లు వేగంగా ప్రాసెస్​చేసేలా తీసుకొచ్చిన టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్​బిల్డింగ్​పర్మిషన్​అప్రూవల్​అండ్​సెల్ఫ్​సర్టిఫికేషన్ సిస్టమ్)సేవలు ఇంతవరకు అప్​గ్రేడ్​కాలేదు. స్టార్టింగ్​లో ఇచ్చిన ఆప్షన్లే నేటికీ ఉన్నాయి. దీంతో అప్లికెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అప్లయ్ చేసుకున్న కొద్ది రోజుల్లోనే బిల్డింగ్​పర్మిషన్​పొందొచ్చని ఆఫీసర్లు చెబుతున్నా.. ప్రక్రియలోని లోపాలతో లేట్​అవుతున్నాయి. ఫీజులు చెల్లించే విషయంలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలు నిర్మాణదారులకు తలనొప్పిగా మారాయి. 2020 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం అమలులోకి తెచ్చింది. అన్ని నిర్మాణాలకు కొత్త మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టం కింద అనుమతులు పొందాలని మెమో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 420 జారీ చేసింది. దీంతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బిల్డింగ్స్ నిర్మించే వారంతా టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పర్మిషన్​కోసం అప్లై చేసుకుంటున్నారు. 75 గజాల లోపు నిర్మాణాలకు ఎలాంటి ఫీజులు లేకుండానే అనుమతులు పొందే వీలుండగా, 500 గజాల లోపు అప్లై చేసుకున్న వెంటనే అనుమతులు పొందవచ్చు. 
నేటికీ ఓల్డ్​వర్షనే..
టీఎస్ బీపాస్ అమల్లోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా అప్లకేషన్ ప్రాసెస్​లో ఎలాంటి మార్పులు జరగలేదని నిర్మాణదారులు చెబుతున్నారు. అప్లై చేసుకునే ముందే అన్ని పక్కాగా చూసుకోవాల్సి వస్తుందంటున్నారు. స్ట్రక్చరల్ డిజైనింగ్​లో మార్పులతో మళ్లీ అప్లయ్ చేసుకోవడానికి, ఎడిట్ ఆప్షన్ తోపాటు రివిజన్ మాడ్యూల్స్ వంటి ఆప్షన్లు లేకపోవడంతో తరచూ కంప్లైంట్లు వస్తున్నాయి. కానీ ఆఫీసర్లు మాత్రం టీఎస్ బీపాస్ ఆప్షన్లను అప్ గ్రేడ్ చేయలేదు. ఆఫీసర్లు సూచించే షార్ట్ ఫాల్స్ కోసం సంబంధిత డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసుకోవడంలోనూ ఇబ్బందులు వస్తున్నాయని ఆర్కిటెక్చర్లు 
చెబుతున్నారు.

చుట్టూ తిరగాల్సిన పరిస్థితి
టైటిల్, టెక్నికల్, సైట్ వెరిఫికేషన్ తర్వాత అప్లికెంట్​కు ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్ వస్తుంది. ఆన్ లైన్ లో ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత షార్ట్ ఫాల్స్ వస్తే ఇరుక్కుపోయినట్లే. ప్రాసెస్ ఎడిట్ చేసుకోలేక, అప్లికేషన్ క్లోజ్ చేసుకోలేక, కట్టిన ఫీజు మొత్తాన్ని రీఫండ్ చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అప్లికెంట్​నాగరాజు వివరించాడు. సంబంధిత అధికారుల దగ్గరికి, లేదా బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నాడు. రీఫండ్ స్టేటస్ దరఖాస్తుదారుడికి మెసేజ్ రాకపోవడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. 5 వర్కింగ్ డేస్ లో రీఫండ్ అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నా.. టెక్నికల్ సమస్యల కారణంగా ప్రక్రియలో మరింత లేట్ అవుతుందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.