తెలుగు వర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్

తెలుగు వర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు:  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏటా నిర్వహించే డిగ్రీ, పీజీ, డిప్లొమా తదితర కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల నోటిఫికేషన్ ను బుధవారం వర్సిటీ అధికారులు రిలీజ్ చేశారు.  2023-–24 విద్యా సంవత్సరానికిగాను వర్సిటీ నిర్వహించే రెగ్యులర్ కోర్సులలో ప్రవేశం కోసం అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ తెలిపారు. శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా తదితర విభాగాల్లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను అందిస్తున్నట్టు చెప్పారు.

ఆయా కోర్సులలో అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులు ఈ నెల16లోగా వర్సిటీ వెబ్ సైట్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫైన్​తో ఈ నెల30 వరకు అప్లై చేసుకోవచ్చన్నారు. పీహెచ్​డీ అడ్మిషన్లకూ దరఖాస్తులు  భాషా శాస్త్రం, సంగీతం, నృత్యం, రంగస్థలం, జానపదం, జర్నలిజం, చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రం, జానపద గిరిజన విజ్ఞానం అంశాల్లో 2023-–24 విద్యా సంవత్సరానికి పీహెచ్​డీ ప్రోగ్రాంలలోనూ అడ్మిషన్లకు అప్లై చేసుకోవచ్చని రమేశ్ తెలిపారు. వివరాలను వర్సిటీ వెబ్​సైట్ www.teluguuniversity.ac.inలో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.