ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ మాస్ లుక్

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ మాస్ లుక్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్ ఇచ్చిన 24గంటల్లోపే మరో కొత్త అప్ డేట్ తో అభిమానులను సంతోషపరిచారు. రీసెంట్ గా తన 30వ సినిమా కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతుందని ప్రకటించిన తారక్... తాజాగా తన 31వ సినిమాకు సంబంధించి మరో ప్రకటనను వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన తదుపరి మూవీ రాబోతున్నట్టు ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించి షేర్ చేసిన ఈ ఫొటోలో తారక్.. గడ్డం, మీసాలతో మాస్ గెటప్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే యశ్ హీరోగా కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన ఘనత దక్కించుకున్న ప్రశాంత్ నీల్... ఇప్పుడు తారక్ తో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తారోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసి, భారీ స్థాయిలో  కలెక్షన్లను వసూళ్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో విజయాన్ని అందిపుచ్చుకున్న  ఎన్టీఆర్, మాస్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సినిమాలను తీస్తూ రికార్డులను బ్రేక్ చేస్తున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా అనే సరికి భారీ స్థాయిలో అంచనాలు నమోదయ్యేటట్టు తెలుస్తోంది.