టీచర్ పోస్టుల్లో సగం కోత!

టీచర్ పోస్టుల్లో  సగం కోత!

 

  • టీచర్ పోస్టుల్లో  సగం కోత!
  • రేషనలైజేషన్​ పేరుతో 5 వేల పోస్టులకు కుదింపు 
  • గతంలో 9,370 ఖాళీలున్నట్టు సర్కారుకు విద్యాశాఖ నివేదిక 
  • స్టూడెంట్ల సంఖ్య తగ్గడంతో పోస్టుల కోతకు సర్కారు ఆదేశం
  • గతంలో 9,370 ఖాళీలున్నట్టు సర్కారుకు విద్యాశాఖ నివేదిక 
  • స్టూడెంట్ల సంఖ్య తగ్గడంతో పోస్టుల కోతకు సర్కారు ఆదేశం
  • కొత్త ఖాళీల ప్రకారం టీఆర్టీ వేసే ఆలోచనలో ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ల ఖాళీల సంఖ్య భారీగా తగ్గనున్నది. స్టూడెంట్, టీచర్ రేషియో పేరుతో సగం పోస్టులకు సర్కారు ఎసరు పెట్టింది. గతంలో 9,370 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు లెక్కలిచ్చిన విద్యాశాఖ.. తాజాగా చేసిన రేషనలైజేషన్ ప్రాసెస్​తో ఆ సంఖ్యను 5 వేలకు కుదించినట్టు తెలిసింది. ఈ పోస్టులతోనే టీఆర్టీ వేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో 26 వేల సర్కారు బడులుంటే, వాటిలో సుమారు 1,500 బడుల్లో స్టూడెంట్లు చేరలేదు. మిగిలిన బడుల్లో 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. స్టేట్​లో మొత్తం 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా, మరో 20 వేల మంది అవసరమని టీచర్ల సంఘాలు చెప్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో 8,792 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వివిధ కారణాలతో ఇప్పటికీ ఆ పోస్టులన్నీ భర్తీ కాలేదు. ఆ తర్వాత 16 వేల మంది విద్యా వలంటీర్లను తీసుకున్నారు. దీంతో ఆయా పోస్టుల్లో  రెగ్యులర్ టీచర్లను నింపాలని నిరుద్యోగులు ఆందోళన సాగిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్ని టీచర్ పోస్టులు అవసరమనే లెక్కలు తీయాలని సర్కారు పెద్దలు విద్యాశాఖకు ఆదేశాలిచ్చారు. దీంతో 9,370 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు తీసి సర్కారుకు పంపించారు. వాటిలో ఎస్జీటీలు 6,360, స్కూల్ అసిస్టెంట్లు 2,179 పోస్టులు ఉండగా, మిగిలినవి లాంగ్వేజీ పండింట్లు, పీఈటీ పోస్టులున్నాయి.  అప్పట్లోనే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారనే ప్రచారం జరిగినా.. సర్కారు టీఆర్టీ వేయలేదు. 

కేవలం 5 వేల పోస్టులతోనే టీఆర్టీ? 

ప్రస్తుతం స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఎంతమంది అవసరమో వివరాలివ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులను సర్కారు ఇటీవల ఆదేశించినట్టు తెలిసింది. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​కు డీఈవోలు, ఆర్జేడీలను పిలిపించి గతంలో ఇచ్చిన రేషనలైజేషన్ జీవో ప్రకారం ప్రస్తుతమున్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా జిల్లాల వారీగా వివరాలు సేకరించారు. దీంతో భారీగా టీచర్ పోస్టులకు కోతపడినట్టు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన 9,370 పోస్టులను 5 వేల పోస్టులకే కుదించినట్టు సమాచారం. దీన్ని అధికారులు గోప్యంగాపెడుతున్నారు. వీటిలో మెజార్టీగా ఎస్జీటీ పోస్టులకే కోతపడ్డట్టు తెలుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డితో పాటు ఇటీవల కొన్ని జిల్లాలకు భారీగా బదిలీలు జరిగాయి. ఆయా జిల్లాల్లో భర్తీ చేసే టీచర్ల సంఖ్య నామమాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిరసనలతో దిగొచ్చిన సర్కారు..

ప్రత్యేక రాష్ట్రం వచ్చి 9 ఏండ్లు కావొస్తు న్నా.. టీచర్ పోస్టుల భర్తీకి ఒక్కటే నోటి ఫికేషన్ వేయడంపై నిరుద్యోగుల్లో నిరా శ మొదలైంది. ప్రస్తుతం ఎన్నికల టైమ్​కావడంతో టీఆర్టీ వేయాలని ఆందోళ నలు మొదలుపెట్టారు. అయితే, నెలరోజు ల క్రితం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన విద్యాశాఖ కేబినెట్ సబ్ కమిటీలో దీనిపై చర్చ జరిగినా.. పిల్లల సంఖ్యతో పోలిస్తే టీచర్లే ఎక్కువగా ఉన్నారని సర్కారు లోని ఓ కీలక మంత్రి వ్యాఖ్యానించారు. నిరుద్యోగ అభ్యర్థులు కలిసినా.. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థులు డీఎస్ఈని ముట్టడించి.. జిల్లాల్లో నిరసనలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని పోస్టులతో అయినా టీఆర్టీ వేయాలని సర్కారు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.