2021లో రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

2021లో రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

న్యూఢిల్లీ: కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ఓలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారు చేయడానికి ఓలాకు ఎటెర్గో బీవీ అనే పేరొందిన సంస్థ సహాయ సహకారాలను అందించింది. 2014లో స్థాపించిన ఎటెర్గో కంపెనీ యాప్ స్కూటర్ అనే వెహికిల్ ను లాంచ్ చేసిన తర్వాత మార్కెట్ లో వరల్డ్ వైడ్ గా బాగా పాపులారిటీ సంపాదించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు వరల్డ్ వైడ్ గా పలు అవార్డులు లభించడం విశేషం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన విశేషాలను కంపెనీ ఫౌండర్, చైర్మన్ భవిన్ష్ అగర్వాల్ పంచుకున్నారు.

‘ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్ దే. కరోనా తర్వాతి పరిస్థితులు ఎలక్ట్రిక్ మొబిలిటీని వరల్డ్ వైడ్ గా పెంచుకునేందుకు దోహదపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కార్లతో పోల్చుకుంటే రెట్టింపు శాతంలో టూ వీలర్స్ అమ్ముడవుతున్నాయి. ఎలక్ట్రిక్ పద్ధతిలో నడవడంతోపాటు డిజిటల్ గా త్వరగా కనెక్ట్ కాగలదు కాబట్టి అర్బన్ ఏరియాల్లో టూవీలర్స్ వాడకానికే యూజర్లు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే చాన్సెస్ మెండుగా ఉన్నాయి. ఈ స్కూటర్ కు సంబంధించిన తయారీలో అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటిస్తున్నామని, డిజైన్ తోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలోనే చేస్తున్నాం’ అని భవిన్ష్ చెప్పారు.