మల్లన్నసాగర్ ముంపు గ్రామంలో విషాదం

మల్లన్నసాగర్ ముంపు గ్రామంలో విషాదం

మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లిలో అర్ధరాత్రి నుంచి అకస్మిక కూల్చివేతలు మొదలయ్యయి. భారీ పోలీసుల  మధ్య JCBలు, ప్రోక్లైనర్లను పెట్టి ఊరును నేలమట్టం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేపిస్తున్నారు. గ్రామస్తులను ఊర్లోకి రానివ్వకుండా.. పోలీస్ బలగాల మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి నుంచి పనులు జరుగుతున్నాయి. ఒకటి, రెండు రోజులు సమయం అడిగినా అధికారులు ఇవ్వలేదంటున్నారు ఎర్రవెల్లి గ్రామస్తులు.

ఎర్రవెల్లి కూల్చివేత పనుల్లో విషాదం చోటుచేసుకుంది. రాత్రి టైంలో కూల్చివేతలు జరుగుతుండటంతో.. ఇంట్లో సామాను తెచ్చుకోవడానికి వెళ్లాడు కనకయ్య అనే వ్యక్తి.  అయితే కనకయ్య ఇంటి పక్కనే కరెంట్ పోల్ ను కూల్చివేయడంతో.. అది మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు గ్రామస్తులు. చికిత్స పొందుతూ కనకయ్య మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని కనకయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.