టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​లో మార్పులు

టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​లో మార్పులు

హైదరాబాద్, వెలుగు: కొత్తగా వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) చేసుకోవడంతోపాటు, గతంలో రిజిస్టర్​ చేసుకున్నవాళ్లు ఎడిట్ చేసుకునేందుకు వీలుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్​పీఎస్సీ) తన వెబ్​సైట్​లో మార్పులు చేసింది. రాష్ట్రాన్ని 33 జిల్లాలు, రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లుగా చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయినందున వాటి ప్రకారం అభ్యర్థులు స్థానికతను ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్ ఓపెన్ చేయగానే.. కొత్తవారైతే న్యూ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ ఎంట్రీ చేయగానే ఆ నంబర్​కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేశాక స్క్రీన్​పై కనిపించే అప్లికేషన్ ఫారంలో పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, ఈ–మెయిల్ ఐడీ,  1 నుంచి 7వ తరగతి వరకు చదివిన జిల్లాల వివరాలు, విద్యార్హతలను ఎంట్రీ చేయాలి.  ఆ తర్వాత సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, అభ్యర్థి ఫొటో, సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత టీఎస్​పీఎస్సీ ఐడీ క్రియెట్ అవుతుంది. దాన్ని డౌన్​లోడ్ చేసుకోవాలి.  ఇప్పటికే రిజిస్టర్​ చేసుకున్నవాళ్లు తమ వివరాలను ఎడిట్ చేసుకోవాలనుకుంటే టీఎస్ పీఎస్సీ ఐడీ, డేటాఫ్ బర్త్ ఎంట్రీ చేయగానే రిజిస్టర్డ్​ ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసి లాగిన్ అయ్యాక గతంలో నమోదు చేసిన వివరాల్లో మార్పులు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. కొత్త జోనల్ సిస్టం ప్రకారం స్థానికతలో మార్పు ఉంటే మార్చుకోవచ్చు. నాలుగేండ్ల కిందట నుంచి ఇప్పటి వరకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ పొంది ఉంటే యాడ్ చేసుకోవచ్చు.