గ్రీన్ కార్డు కోసం 2 లక్షల మంది భారతీయులు

గ్రీన్ కార్డు కోసం 2 లక్షల మంది భారతీయులు

అమెరికాలో ఎంతోకాలంగా ఉద్యోగం చేస్తున్న ఇండియన్లు లక్షల్లో ఉన్నారు. వారిలో కొంత మంది అక్కడే శాశ్వతంగా ఉండేందుకు నిర్ణయించుకున్నవారు ఉన్నారు. ఆదేశంలో శాశ్వతంగా ఉండాలంటే గ్రీన్ కార్డ్ ఉండాల్సిందే. గ్రీన్ కార్డ్ కోసం చూస్తున్న వారిలో ముఖ్యంగా భారతీయులే ఎక్కువగా ఉన్నారు.

అమెరికాలో మొత్తం 40 లక్షల మంది ప్రజలు గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా ప్రభుత్వం మాత్రం ఏటా 2,26,000 మాత్రమే కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో ఎక్కువగా భారత్‌కు చెందిన 2,27,000 మంది ఉన్నారు. 1,80,00 మంది చైనీయులు ఉండగా.. మెక్సికో దేశానికి చెందిన 1.5 లక్షల మంది ఉన్నారు.

ఈ లిస్టులోని వారిలో చాలా మంది ప్రస్తుతం అమెరికా పౌరసత్వం ఉన్నవారి కుటుంబసభ్యులే. ప్రస్తుత చట్టం ప్రకారం అమెరికా పౌరులు వారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులకు గ్రీన్‌కార్డ్‌ లేదా శాశ్వత నివాసాన్ని స్పాన్సర్‌ చేయవచ్చు. అయితే అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని రద్దు చేయాలని అనుకుంటున్నారు.