పూర్తయిన ఫ్లిప్​కార్ట్, ఫోన్​పే విభజన

పూర్తయిన ఫ్లిప్​కార్ట్, ఫోన్​పే విభజన

న్యూఢిల్లీ :ఫ్లిప్‌‌‌‌కార్ట్, ఫోన్‌‌పే యాజమాన్య విభజన పూర్తయింది. ఇక నుంచి ఈ  రెండు సంస్థలు అమెరికా ఆధారిత రిటైల్ కంపెనీ వాల్‌‌మార్ట్ కింద కార్యకలాపాలను కొనసాగిస్తాయి. డిజిటల్​ పేమెంట్స్​ సంస్థ  ఫోన్​పేను 2016లో ఫ్లిప్‌‌కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. వాల్‌‌మార్ట్ నాయకత్వంలోని ఫ్లిప్‌‌కార్ట్ సింగపూర్,  ఫోన్‌‌పే సింగపూర్ వాటాదారులు నేరుగా ఫోన్​పే ఇండియాలో వాటాలను కొనుగోలు చేశారు. దీనివల్ల ఫోన్​పే పూర్తిగా భారతదేశ కంపెనీగా మారింది. ఈ పని ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలయింది. వాల్‌‌మార్ట్ రెండు సంస్థల్లోనూ మెజారిటీ వాటాదారుగా ఉంటుంది. ఫ్లిప్​కార్ట్,​  ఫోన్​పేలకు 40 కోట్ల చొప్పున యూజర్ బేస్ ఉంది. తాము కొత్త వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మరింత వృద్ధి సాధిస్తామని, ఫోన్​పే సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. 

ఈ సంవత్సరంలో ఫోన్​పే తన డోమిసైల్​ను సింగపూర్ నుండి భారతదేశానికి మార్చింది.  ఫోన్​పే దేశంలోని 99 శాతం పిన్ కోడ్‌‌లను కవర్ చేస్తుందని, 3.5 కోట్ల మంది  ఆఫ్‌‌లైన్ వ్యాపారులు తమ నెట్​వర్క్​లో చేరారని కంపెనీ ప్రకటించింది.  ఫోన్​పే ఒక విజయవంతమైన సంస్థగా వృద్ధి చెందడం అభివృద్ధి చెందడం చూసి గర్విస్తున్నామని, కోట్లాది మంది మంది భారతీయులకు ఆర్థిక సేవలను అందించే టార్గెట్​తో పనిచేయడం కొనసాగిస్తుందని ఫ్లిప్​కార్ట్​ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.