పియర్స్ పండు తింటే..

పియర్స్ పండు తింటే..

పియర్స్ పండ్లలో విటమిన్​–సి, ఫైబర్ ఎక్కువ ఉంటాయి  అంటోంది న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా. 

ఇమ్యూనిటీ పెరగడానికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న విటమిన్–సి చాలా అవసరం. ఇందులోని  ఫైబర్ రక్తంలో చక్కెర శాతం పెరగనీయదు. దాంతో డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ పండు తినొచ్చు. 

పియర్స్​ పండు  పై పొరలో పెక్టిన్ అనే ఫైబర్​ ప్రొటీన్ ఉంటుంది. ఇది హానికరమైన లో– డెన్సిటీ లిపోప్రొటీన్​, ట్రైగ్లిజరైడ్స్​ సంఖ్యని తగ్గిస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ పెరగదు.  అంతేకాదు ఈ ప్రొటీన్ పొట్టలోని కొవ్వు పదార్థాలకు అంటుకొని వాటిని బయటకు పంపించి, కడుపుబ్బరం సమస్యని తగ్గిస్తుంది.

ఈ పండులో యుర్సోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్​కి కారణమయ్యే  ఎంజైమ్​ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇందులోని ఐసోక్వెర్​సిట్రిన్ డిఎన్​ఎ దెబ్బతినకుండా చూస్తుంది.