మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. 14.2 కిలోల డొమెస్టిక్ నాన్-సబ్సిడీ సిలిండర్ పై రూ.25  పెంచుతూ పెట్రోలియం కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ. 884.50 పైసలకు చేరింది. ఇక 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై రూ.75  పెంచారు. ఢిల్లీలో ప్రస్తుతం 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1693 కి పెరిగింది.