25 కోట్లకు చేరిన ఫోన్‌పే యూజర్లు

25 కోట్లకు చేరిన ఫోన్‌పే యూజర్లు

న్యూఢిల్లీ: పేమెంట్స్‌‌ సర్వీసెస్‌‌ కంపెనీ ఫోన్‌‌పేలో రిజిస్టర్‌‌‌‌ అయిన యూజర్ల సంఖ్య 25 కోట్లకు చేరుకుంది. కంపెనీ మంత్లి యాక్టివ్‌‌ యూజర్లు 10 కోట్లకు పైనే ఉంటారని ఫోన్‌‌పే చెబుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో ఏకంగా 230 కోట్ల యాప్ సెషన్స్‌‌ నమోదు చేశామని పేర్కొంది. ఫోన్‌‌పే ద్వారా గత నెలలో రికార్డ్‌‌ స్థాయిలో 92.5 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో తెలిపింది. 83.5 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు ఫోన్‌‌ఫే ద్వారా జరిగాయని పేర్కొంది. మొత్తం పేమెంట్స్ వాల్యూ 27,700 కోట్ల డాలర్లని, 40 శాతం మార్కెట్‌‌ వాటాతో ఫోన్‌‌పే లీడర్‌‌‌‌గా ఉందని కంపెనీ పేర్కొంది. 2022, డిసెంబర్ నాటికి 50 కోట్ల రిజిస్టర్డ్‌‌ యూజర్లను టార్గెట్‌‌గా పెట్టుకున్నామని ఫోన్‌‌పే ఫౌండర్‌‌‌‌ సమీర్‌‌‌‌ నిగమ్ అన్నారు. ఇనొవేటివ్‌‌ ప్రొడక్ట్‌‌లను మరిన్ని లాంచ్ చేస్తామని, దేశంలోని ప్రతి గ్రామాల్లో డిజిటల్ పేమెంట్స్‌‌ను పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం ఇండియన్‌‌ పేమెంట్స్‌‌ సర్వీస్‌‌ మార్కెట్‌‌లో గూగుల్ పే, మొబిక్విక్‌‌, పేటీఎం వంటి కంపెనీలతో ఫోన్‌‌పే పోటీపడుతోంది. తాజాగా స్విచ్‌‌ అనే కొత్త ఫీచర్‌‌‌‌ను ఫోన్‌‌పే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌‌‌‌ ద్వారా మొత్తం 220 యాప్స్‌‌ను యాక్సెస్‌‌ చేసుకోవడానికి కస్టమర్లకు వీలుంటుంది. వీటిలో ఓలా, మింత్రా, ఐఆర్‌‌‌‌సీటీసీ వంటి యాప్స్‌‌ కూడా ఉన్నాయి. దేశంలోని 500 సిటీలలో 1.3 కోట్ల వ్యాపారాలు ఫోన్‌‌పేని వాడుతున్నాయి.