గంగా నదిలో మోడీ ప్రత్యేక పూజలు

గంగా నదిలో మోడీ ప్రత్యేక పూజలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వారణాసిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోడీ. ఆ తర్వాత పవిత్ర గంగా నదిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నదిలో ప్రధాని పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం తన మెడలో ఉన్న జపమాలను తీసి మంత్రాలు చదువుతూ పూజలు చేశారు. నదిలో మునకలు వేశారు. మంత్రాలు ఉచ్చరిస్తూ గంగానదిలో ప్రత్యేకంగా పూజలు చేశారు ప్రధాని. 

మరికాసేపట్లో కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మకంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ను చేపట్టారు. వారణాసి వచ్చాక మొదట కాలభైరవ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత జనానికి అభివాదం చేశారు. ఇంకోవైపు ఆలయ పరిసరాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను పరిశీలించారు. ఖిడ్ కియా ఘాట్ ను ప్రత్యేకంగా సందర్శించారు మోడీ. అక్కడే ఉన్న షిప్ లోకి వెళ్లి అందులో ఉన్న వసతులను పరిశీలించారు. కాసేపు పడవలో కలియదిరిగారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.