పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల పరిశీలన, ధర్నాకు కాంగ్రెస్  పిలుపునివ్వడంతో PCC చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. భూముల సందర్శనకు కాంగ్రెస్  నేతలు, శ్రేణులు వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు కోకాపేట భూముల వద్దకు పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్  దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్  గౌడ్ , రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారిని కూడా పోలీసుల అడ్డుకునే అవకాశముంది. కోకాపేటకు వెళ్లే అన్ని దారులను దిగ్బంధం చేశారు పోలీసులు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగిలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.