భారీ చలాన్ పడకుండా ఉండాలంటే.. ఈ రూల్ పాటించండి!

భారీ చలాన్ పడకుండా ఉండాలంటే.. ఈ రూల్ పాటించండి!

కోటి మంది చూసిన వీడియో 

ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి భారీ చలాన్లు. దేశంలో ఇపుడు ఇదే హాట్ టాపిక్. మన రాష్ట్రంలో , హైదరాబాద్ లో ఇంకా పెరిగిన చలాన్లు అమలులోకి రాలేదు. ఐతే.. పోలీసులు దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చలాన్లు వేయడం పక్కనపెట్టి… రూల్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

కొత్త రూల్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతోంది. రోడ్లు సరిగా ఉండవు… ట్రాఫిక్ నియంత్రణ సరిగా ఉండదు.. కానీ.. భారీ చలాన్లు వేయడం ఏంటి.. అని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ చలాన్ల నుంచి ఇలా తప్పించుకోండి అంటూ.. ఓ పోలీస్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియా షేకయ్యేలా వైరల్ అవుతోంది. చాలామంది భయంతో భారీ చలాన్లు కడుతున్నారని.. నిజానికి ఆ భయం అవసరం లేదని.. జరిమానాను వంద రూపాయలతోనే సరిపెట్టొచ్చని చెప్పారు.

సునీల్ సంధు అనే కానిస్టేబుల్ ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అవేర్ నెస్ కోసం.. జనాలకు ఓ సంగతి చెప్పదల్చుకున్నా అని వివరించాడు. “భారీ చలాన్లు వేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. కానీ అలా చేయకండి. ఇది మన దేశం బాగుకోసం కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీన్ని సమర్థించండి. భారీ చలాన్లను ఇలా తప్పించుకోండి. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే రూ.15వేల ఫైన్ పడుతుంది. కానీ.. మీరు వంద రూపాయలతో సరిపెట్టొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ ఇలా.. ఏ డాక్యుమెంట్ లేకున్నా వేలకు వేల ఫైన్ పడుతుందని అధైర్య పడొద్దు. ఫైన్ వేశాక… వాటిని సబ్ మిట్ చేయడానికి 15 రోజుల టైమ్ ఉంటుంది. ఈ 15 రోజుల్లో ఆ డాక్యుమెంట్ ను సంబంధిత అధికారులకు ఇవ్వండి. అప్పుడు వయొలేషన్ కు కేవలం రూ.100 మాత్రమే తీసుకుని మిగతాది తీసేస్తారు” అని వీడియోలో చెప్పాడు ఆ కానిస్టేబుల్.

ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియోను 3లక్షల మంది షేర్ చేశారు. పది మిలియన్లు అంటే కోటి వ్యూస్ వచ్చాయి. లక్షన్నర లైక్స్ ఉన్నాయి.

22000 हजार का #चालान 400 में कैसे निपटाए

22000 हजार का #चालान 400 में कैसे निपटाए, इस पुलिस जवान ने एकदम सही सलाह दी है

Studfeed 发布于 2019年9月11日周三