ఐక్యమత్యం అంటే ఇలానే ఉండాలి: హర్ష్ గోయెంకా

ఐక్యమత్యం అంటే ఇలానే ఉండాలి: హర్ష్ గోయెంకా

యూనిటీ  ఏ రంగంలోనైనా టీం వర్క్ ఉంటే  అద్భుతమైన ఫలితాలు వస్తాయి. యూనిటి లేకుంటే రాణించడం చాలా కష్టం. అందుకే ఐక్యమత్యమే మహాబలం అన్నారు పెద్దలు. అయితే యూనిటి గురించి    లేటెస్ట్ గా ప్రముఖ బిజినెస్  మెన్ హర్ష్ గోయెంకా తన ట్విట్టర్లో  పోస్ట్ చేసిన ఓ వీడియో ఇపుడు వైరల్ గా మారుతోంది.

ఈ వీడియోలో  పదుల సంఖ్యలో గొంగళి పురుగులు  వెళుతున్నాయి. ఒకదానితో ఒకటి అతుక్కుని వేగంగా పోతున్నాయి. విడిగా అయితే ఈ  గొంగళి పరుగులు నెమ్మదిగా వెళ్తాయి. ‘ ఇది గొంగళి పురుగుల గ్రూప్ , రోలింగ్ స్వార్మ్ అని పిలువబడే నిర్మాణంలో కదులుతుంది. గొంగళి పరుగులు విడిగా కంటే కలిసి ఎక్కువ వేగంగా వెళ్లగలవు . ఇదే ఐక్యమత్య బలం అంటే ’ అని హర్ష్ గోయెంక్ ట్వీట్ చేశారు. దీనికి వేలాది మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నానారు.