40 కోట్లను దాటిన జన్‌ ధన్ అకౌంట్లు

40 కోట్లను దాటిన జన్‌ ధన్ అకౌంట్లు

పీఎంజేడీఐ ప్రారంభించిన ఆరేళ్లలో నే రికార్డు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రొగ్రామ్ ప్రధాన్‌ మంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీఐ) కింద ప్రారంభమైన బ్యాంక్ అకౌంట్లు 40 కోట్ల మార్క్ ను చేరుకున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్ ప్రొగ్రామ్ ను ప్రారంభించిన ఆరేళ్లలోనే ఈ రికార్డును సాధిం చింది. 2014 ఆగస్ట్ 28న పీఎంజేడీఐను ప్రభుత్వం లాంఛ్ చేసిం ది. ప్రజలందరికీ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది. తాజా లెక్కల ప్రకారం, ఈ స్కీమ్ కింద 40.05 కోట్ల మంది లబ్దిదారులు జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించారు.

ఈ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అయిన మనీ రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఉందని ఫైనాన్సి యల్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఈ ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్ ప్రొగ్రామ్ ను లాస్ట్ మైలుకు తీసుకువెళ్లాలన్నదే తమ లక్ష్యమని చెప్పింది. పీఎంజేడీఐ కింద ఓపెన్ చేసే బ్యాంక్ అకౌంట్లు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లుగా ఉన్నాయి.