ఓఎన్​డీసీలో హీరో ప్రొడక్టులు

ఓఎన్​డీసీలో హీరో ప్రొడక్టులు

న్యూఢిల్లీ: వినియోగదారులకు సులభంగా, అందుబాటు ధరల్లో తమ ప్రొడక్టులను అందించడానికి కేంద్రం తెచ్చిన ఓపెన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్​డీసీ)లో చేరినట్లు టూవీలర్​తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సోమవారం తెలిపింది.   ఓపెన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ద్వారా ప్రారంభంలో ద్విచక్ర వాహనాల విడిభాగాలను, ఉపకరణాలను,  సరుకులను అందిస్తుంది. పేటీఎం, మైస్టోర్​ వంటి ఏదైనా కొనుగోలుదారు యాప్‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌‌‌‌‌‌‌‌లు 'హీరో జెన్యూన్ పార్ట్‌‌‌‌‌‌‌‌లను' సులభంగా ఓఎన్​డీసీ ప్లాట్​ఫారమ్​ నుంచి కొనవచ్చని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది.