ప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయడం లేదు

ప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయడం లేదు

తెలంగాణలో విద్యారంగాన్ని విధ్వంసం చేశారని  ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.  రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా మారిందని చెప్పారు. మద్యం విపరీతంగా పెరిగిపోయిదన్నారు.  మైనర్లు పబ్కి వెళ్లొచ్చు..కానీ మద్యం తాగొద్దని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారని...ఇది  సంకేతమని ప్రశ్నించారు. విద్యార్థులు కూడా నేరాల్లో పాల్గొంటుంటే...ఉపాధ్యాయులుగా మా కర్తవ్యం మేం చేస్తున్నామా అనే డౌట్ వస్తుందన్నారు.  ప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయకుండా.. నేరం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఉన్నతమైన సమాజం వస్తుందని ఆశించామన్న ఆయన..రేప్లు ,అత్యాచారాలు, తల్లిదండ్రులే పిల్లల్ని చంపడం వంటి దుర్మార్గ చర్యలను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.   తెలంగాణ కోసం రాసిన పాటలు కూడా బ్యాన్ అయ్యాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.  అన్ని జేఏసీలు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు.  తెలంగాణను ప్రజాస్వామ్య సమాజంగా మార్చే ప్రయత్నం చేయడంలేదన్న ఆయన.. రాష్ట్రం వచ్చాక కూడా పాత చట్టాలే అమలులో ఉంటే ఏ మారుతుందని ఆయన ప్రశ్నించారు.  రాజకీయ పార్టీలు.. సమాజానికి ఏం విలువలు ఇస్తున్నాం అనేది చూసుకోవాలని హరగోపాల్ సూచించారు.