జేఎల్ నోటిఫికేషన్​ నిబంధనలు..ఆందోళనలో అభ్యర్థులు

జేఎల్ నోటిఫికేషన్​ నిబంధనలు..ఆందోళనలో  అభ్యర్థులు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
  • టీఎస్​పీఎస్సీలో లేని నిబంధన గురుకులాల్లో అమలు
  • జేఎల్​, డీఎల్, పీడీ, లైబ్రేరియన్​ పోస్టుల్లో డెమోకు 25 మార్కులు 
  • రాత పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం
  • ఏ ఎగ్జామ్​కు లేనంతగా రూ.1,200 అప్లికేషన్ ఫీజు
  • సర్వర్​ స్లోతో ముందుకు సాగని అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు:గురుకులాల్లో జూనియర్ లెక్చరర్​(జేఎల్​) పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్​లోని నిబంధనలు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీఎస్​పీఎస్సీ భర్తీ చేసే  జేఎల్​ పోస్టులకు కేవలం సంబంధిత సబ్జెక్ట్​లో పీజీ ఉంటే సరిపోతుంది. కానీ, గురుకులాల జేఎల్​ పోస్టుకు మాత్రం పీజీతోపాటు బీఎడ్​ తప్పనిసరి అని నోటిఫికేషన్​లో గురుకుల రిక్రూట్​మెంట్ బోర్డు పేర్కొంది.

ఒకే స్టేట్​లో ఒకే రకమైన పోస్టుకు రెండు వేర్వేరు  క్వాలిఫికేషన్ల నిబంధనలు ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పైగా.. డెమోకు 25 మార్కులు కేటాయించడం, నెగిటివ్​ మార్కుల నిబంధన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్ తదితర పోస్టుల భర్తీకి రెండ్రోజుల కింద గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిద్వారా మొత్తం1,940 జేఎల్, 793 డీఎల్, 73 పీడీ, 86 లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, ఇంతవరకూ బాగానే ఉన్నా.. నిబంధనలే అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాయి. సర్కారు జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న1,392 జేఎల్​ పోస్టుల భర్తీకి గత డిసెంబర్​లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆయా పోస్టులకు పీజీ క్వాలిఫికేషన్ అడిగింది. కానీ రెండ్రోజుల కింద గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో జేఎల్ పోస్టులకు మాత్రం పీజీతో పాటు బీఎడ్​ తప్పనిసరి అని రూల్​ పెట్టారు. బీఎడ్​నిబంధనతో చాలామంది ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని అభ్యర్థులు వాపోతున్నారు. మరోపక్క రాత పరీక్షలకు నెగెటివ్ మార్కులనూ పెట్టారు. నాలుగు క్వశ్చన్లకు తప్పు ఆన్సర్ చేస్తే, ఒక మార్కు కట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. 

అన్నిటికీ డెమో.. 25 మార్కులు..

గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే నాలుగు రకాల పోస్టులకు పరీక్షలతో పాటు డెమో ఉంటుందని ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్​పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ఎలాంటి ఇంటర్వ్యూలు, డెమోలు లేవని, కానీ గురుకుల బోర్డు మాత్రం డెమో పెట్టడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గురుకులాల్లో భర్తీ చేసే జేఎల్, డీఎల్​తో పాటు లైబ్రేరియన్, పీడీ పోస్టులకు 25 మార్కులను డెమో కింద కేటాయించారు. అయితే, టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్1, గ్రూప్ 2 వంటి పరీక్షలకు కూడా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో తెలిపింది. అయితే, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఇంటర్వ్యూ తీరులో డెమో పెట్టడంపై మాత్రం సర్కారు పెద్దలు నోరుమెదపడం లేదు. గురుకుల జేఎల్​ పోస్టులకు 325 మార్కులుంటే, దీంట్లో మూడు పేపర్లకు మూడు వందల మార్కులు,  డెమోకు 25 మార్కులు ఉంటాయి.  గురుకుల డీఎల్​ పోస్టులకు 225 మార్కులుంటే.. దీంట్లో రెండు పేపర్లకు రెండు వందల మార్కులు, డెమోకు 25 మార్కులు ఉంటాయి. అయితే, ఈ డెమో మార్కులు ఉద్యోగం పొందే టైమ్​లో కీలకంగా మారనుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఏ రిజర్వేషన్ల విధానం అమలు చేస్తున్నారనే దానిపై నోటిఫికేషన్​లో క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం 2,876 పోస్టుల్లో 2,301 పోస్టులు మహిళలకే కేటాయించడంపై పురుషుల్లో నిరాశ మొదలైంది. 

ఒక్కో పోస్టుకు రూ. 1,200 ఫీజు

గురుకుల పోస్టులకు అప్లికేషన్ ఫీజు భారీగా నిర్ణయించారు. ఏ పోస్టుకైనా రూ.1,200 ఫీజు చెల్లించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు మాత్రం రూ.600 ఫీజు నిర్ణయించారు. అయితే, గతంలోనూ ఇంతే ఫీజు ఉందని అధికారులు చెప్తున్నా.. ప్రస్తుతం వరుస నోటిఫికేషన్ల నేపథ్యంలో అన్నింటికీ అంత మొత్తంలో ఫీజు చెల్లించి అప్లయ్​ చేయాలంటే, అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. మరోపక్క టీఎస్​పీఎస్సీ మాత్రం రూ.200 మాత్రమే తీసుకుంటుండగా, గురుకుల బోర్డు మాత్రం ఇంతభారీ మొత్తం వసూలు చేయడం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేస్తున్నారు.
ఒకే స్టేట్​లో ఒకే రకమైన పోస్టుకు రెండు వేర్వేరు  క్వాలిఫికేషన్ల నిబంధనలు ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పైగా.. డెమోకు 25 మార్కులు కేటాయించడం, నెగిటివ్​ మార్కుల నిబంధన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్ తదితర పోస్టుల భర్తీకి రెండ్రోజుల కింద గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిద్వారా మొత్తం1,940 జేఎల్, 793 డీఎల్, 73 పీడీ, 86 లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, ఇంతవరకూ బాగానే ఉన్నా.. నిబంధనలే అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాయి. సర్కారు జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,392 జేఎల్​ పోస్టుల భర్తీకి గత డిసెంబర్​లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆయా పోస్టులకు పీజీ క్వాలిఫికేషన్ అడిగింది. కానీ రెండ్రోజుల కింద గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో జేఎల్ పోస్టులకు మాత్రం పీజీతో పాటు బీఎడ్​ తప్పనిసరి అని రూల్​ పెట్టారు. బీఎడ్​నిబంధనతో చాలామంది ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని అభ్యర్థులు వాపోతున్నారు. మరోపక్క రాత పరీక్షలకు నెగెటివ్ మార్కులనూ పెట్టారు. నాలుగు క్వశ్చన్లకు తప్పు ఆన్సర్ చేస్తే, ఒక మార్కు కట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. 

అన్నిటికీ డెమో.. 25 మార్కులు..

గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే నాలుగు రకాల పోస్టులకు పరీక్షలతో పాటు డెమో ఉంటుందని ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్​పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ఎలాంటి ఇంటర్వ్యూలు, డెమోలు లేవని, కానీ గురుకుల బోర్డు మాత్రం డెమో పెట్టడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గురుకులాల్లో భర్తీ చేసే జేఎల్, డీఎల్​తో పాటు లైబ్రేరియన్, పీడీ పోస్టులకు 25 మార్కులను డెమో కింద కేటాయించారు. అయితే, టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్1, గ్రూప్ 2 వంటి పరీక్షలకు కూడా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో తెలిపింది. అయితే, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఇంటర్వ్యూ తీరులో డెమో పెట్టడంపై మాత్రం సర్కారు పెద్దలు నోరుమెదపడం లేదు. గురుకుల జేఎల్​ పోస్టులకు 325 మార్కులుంటే, దీంట్లో మూడు పేపర్లకు మూడు వందల మార్కులు,  డెమోకు 25 మార్కులు ఉంటాయి.  గురుకుల డీఎల్​ పోస్టులకు 225 మార్కులుంటే.. దీంట్లో రెండు పేపర్లకు రెండు వందల మార్కులు, డెమోకు 25 మార్కులు ఉంటాయి. అయితే, ఈ డెమో మార్కులు ఉద్యోగం పొందే టైమ్​లో కీలకంగా మారనుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఏ రిజర్వేషన్ల విధానం అమలు చేస్తున్నారనే దానిపై నోటిఫికేషన్​లో క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం 2,876 పోస్టుల్లో 2,301 పోస్టులు మహిళలకే కేటాయించడంపై పురుషుల్లో నిరాశ మొదలైంది. 

ఒక్కో పోస్టుకు రూ. 1,200 ఫీజు

గురుకుల పోస్టులకు అప్లికేషన్ ఫీజు భారీగా నిర్ణయించారు. ఏ పోస్టుకైనా రూ.1,200 ఫీజు చెల్లించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు మాత్రం రూ.600 ఫీజు నిర్ణయించారు. అయితే, గతంలోనూ ఇంతే ఫీజు ఉందని అధికారులు చెప్తున్నా.. ప్రస్తుతం వరుస నోటిఫికేషన్ల నేపథ్యంలో అన్నింటికీ అంత మొత్తంలో ఫీజు చెల్లించి అప్లయ్​ చేయాలంటే, అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. మరోపక్క టీఎస్​పీఎస్సీ మాత్రం రూ.200 మాత్రమే తీసుకుంటుండగా, గురుకుల బోర్డు మాత్రం ఇంతభారీ మొత్తం వసూలు చేయడం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేస్తున్నారు.

సర్వర్ స్లో.. 200లోపే అప్లికేషన్లు!

గురుకుల రిక్రూట్మెంట్ పోస్టులకు అప్లయ్​ చేసుకునే వారికి తిప్పలు తప్పడం లేదు. అభ్యర్థులు https://treirb.telangana.gov.in వెబ్ సైట్ ద్వారానే వన్ టైమ్ రిజిస్ట్రేషన్​తోపాటు దరఖాస్తు కూడా చేసుకోవాల్సి ఉంది. వారం రోజుల కింది నుంచి ఓటీఆర్​ అప్లయ్​కి అవకాశం ఇవ్వగా, ఇప్పటి వరకు 14 వేల మంది మాత్రమే రిజిస్టర్​ చేసుకున్నారు. గురుకుల పోస్టులకు సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, మంగళవారం సాయంత్రం నాటికీ 200 మందిలోపే పేమెంట్ చేసి, అప్లయ్​ చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఓటీఆర్ దరఖాస్తుకు సుమారు రెండు గంటల నుంచి మూడు గంటల సమయం పడుతున్నదని, సర్వర్ ప్రాబ్లమ్​తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభ్యర్థులు అంటున్నారు.  వెంటనే సర్వర్ కెపాసిటీ పెంచాలని కోరుతున్నారు.