కేంద్ర పథకాలను పక్కదారి పట్టిస్తున్నరు.. పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల

కేంద్ర పథకాలను పక్కదారి పట్టిస్తున్నరు.. పశు సంవర్ధక శాఖ మంత్రి  పురుషోత్తం రూపాల

కామారెడ్డి, భిక్కనూరు,  వెలుగు:  కేంద్ర పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క దారి పట్టిస్తున్నదని  కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి  పురుషోత్తం రూపాల  ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో  బీజేపీ  గెలుపు కోసం  క్యాడర్​ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.  మహాజన్​ సంపర్క్​ అభియాన్​  ప్రోగ్రాంలో  భాగంగా  శనివారం  కామారెడ్డి జిల్లా  దోమకొండ, భిక్కనూరు మండలాల్లో ఆయన పర్యటించారు. దోమకొండ  మండల కేంద్రంలో ని  102 బూత్​లో  కేంద్ర మంత్రి ఇంటింటికీ తిరుగుతూ   పాంప్లెంట్లు పంపిణీ చేశారు. 

ప్రభుత్వ స్కీంలను స్థానికులకు వివరించారు.   భిక్కనూరులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పార్టీ  స్థాపించిన కొత్తలో  డిపాజిట్​ వస్తే చాలని అనుకునే వాళ్లని,   కానీప్పుడు  భారీ మెజార్టీతో  కేంద్రంతో పాటు, అనేక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నామన్నారు.   అప్పట్లో ఈ  ఏరియాలో  టైగర్​ నరేంద్ర ఒకరే ఉండేవారని కానీప్పుడు చాలా  మంది ఉన్నారన్నారు.    కేంద్ర  పథకాలు,  అభివృద్ధి పనులను పార్టీ శ్రేణులు ఇంటింటికి  వెళ్లి  వివరించాలన్నారు.  పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ అరుణతార,  కామారెడ్డి నియోజక వర్గ ఇన్​చార్జి  కాటిపల్లి వెంకటరమణారెడ్డి,  పార్టీ మండల ప్రెసిడెంట్​ రమేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.