చలాన్లకు బ్రేక్.. హెల్మెట్లు కొనిపిస్తున్న రాచకొండ పోలీసులు

చలాన్లకు బ్రేక్.. హెల్మెట్లు కొనిపిస్తున్న రాచకొండ పోలీసులు

రాచకొండ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ చలాన్లకు బ్రేక్ ఇచ్చారు. పదే పదే చలాన్లు వేయడం కంటే.. కొద్దిరోజులు వారికి అవగాహన కల్పించడం కరెక్ట్ నిర్ణయానికి వచ్చారు. హెల్మెట్ లేనివారికి, వెహికల్ ఇన్సూరెన్స్ చేయని వారికి, పొల్యూషన్ చెక్, లైసెన్స్ లేనివారికి వాటిని దగ్గరుండి ఇప్పిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు.

డీజీపీ, రాచకొండ కమిషనర్ ఆదేశాలతో.. ఈ కొత్త నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ అధికారులు చెప్పారు. ట్రాఫిక్ చలాన్లు వేయకుండా.. వాహనాలు నడిపేవారిని నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతున్నవారితో.. అక్కడికక్కడే వారితో దాన్ని కొనిపించి అందిస్తున్నారు.

రాచకొండ ట్రాఫిక్ పోలీసుల ప్రయత్నాన్ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ , అర్బన్ డెవలప్ మెంట్, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. మంచి ప్రయత్నం అని మెచ్చుకున్నారు.