వందకోట్లతో లారెన్స్ 3D సినిమా

వందకోట్లతో లారెన్స్ 3D సినిమా

కొరియోగ్రాఫర్‌‌‌‌గానే పరిచయమైనా..  నటుడిగా, దర్శకుడిగా కూడా సత్తా చూపాడు రాఘవ లారెన్స్. హారర్ చిత్రాలు తీయడంలో తనకు తిరుగులేదనిపించాడు. ప్రస్తుతం ‘కాంచన’ను బాలీవుడ్‌‌లో రీమేక్ చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. అక్షయ్‌‌ కుమార్‌‌‌‌, కియారా అద్వానీ జంటగా ‘లక్ష్మీబాంబ్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఇంకా సెట్స్‌‌ మీద ఉండగానే లారెన్స్‌‌ నెక్స్ట్‌‌ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

భారీ బడ్జెట్‌‌తో ఒక త్రీడీ మూవీ చేయనున్నాడట లారెన్స్. సన్‌‌ పిక్చర్స్‌‌ నిర్మించే ఈ చిత్రంలో వీఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌కి ప్రాధాన్యత ఎక్కువట. తొలి విడతగా అయితే వంద కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారట. ఇదింకా పెరిగే చాన్స్‌‌ కూడా ఉందని సమాచారం. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో అన్ని భాషల్లోని ప్రముఖ నటీనటుల్ని, టెక్నీషియన్స్‌‌ని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకూ తెలిసిన సమాచారం ప్రకారం ఇది ఒక సూపర్‌‌‌‌ హీరో మూవీ. క్రిష్, ధూమ్‌‌ తరహాలో సాగుతుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ‘లక్ష్మీబాంబ్’ పూర్తవగానే లారెన్స్‌‌ ఆ ప్రాజెక్ట్ పగ్గాలు చేపడతాడు. మరి తానే హీరోగా నటిస్తాడా లేక ఎవరైనా స్టార్ హీరోని తీసుకుంటాడా అనేది చూడాలి. దీని గురించి అధికారిక ప్రకటనైతే లేదు. కాకపోతే వార్త కాస్త బలంగానే వినిపిస్తోంది.