ఇండియాకు లక్ష కోట్ల డాలర్లు నష్టం

ఇండియాకు లక్ష కోట్ల డాలర్లు నష్టం

న్యూఢిల్లీ: కరోనాకు ముందు కూడా ఎకానమీ పరిస్థితి ఏమంత బాగోలేదని ఐఎంఎఫ్‌‌ వెబీనార్‌‌‌‌లో రఘురామ్ రాజన్ అన్నారు. పెద్ద పెద్ద స్టిమ్యులస్‌ ప్యాకేజిలను అందించడానికి ప్రభుత్వం వద్ద తక్కువ మార్గాలున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ట్యాక్స్‌‌ల నుంచి వారానికి 60–70 బిలియన్ డాలర్లను సంపాదిస్తుందని.. ఎకానమీ సైజు 3 ట్రిలియన్ డాలర్లని.. అయితే కరోనా లాక్‌‌డౌన్‌‌ కారణంతో ప్రభుత్వం ఒక ట్రిలియన్ డాలర్ల వరకు కోల్పోయే అవకాశం ఉందని రఘురామ్ రాజన్ అంచనావేశారు. పేదలకు, ధనవంతులకు మధ్య తేడా ఇంకా పెరుగుతుందని.. ప్రభుత్వం ప్రజల హెల్త్ పైనే దృష్టిసారించాలని సూచించారు. ఒకవేళ అలా చేయకపోతే 20 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. కరెన్సీ ప్రింట్ చేయడానికి గల మార్గాలను ప్రభుత్వం వెతకాలి, కానీ వాటివల్ల కూడా ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బయట నుంచి మరింత క్యాపిటల్ పొందేందుకు సంస్కరణలు తీసుకురావాలని రాజన్ సూచించారు. రాజన్ వెబీనార్‌‌‌‌లో ఇండియాలో కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులపై పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

ఇండివిడ్యువల్స్ పరంగా చూసుకుంటే.. ప్రజల ఆరోగ్యం, సేఫ్టీ నెంబర్ వన్, టూ పొజిషన్‌‌లోకి వచ్చాయి. ఇన్ని రోజులు ఇవి మూడు, నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇతర వాటిపై ఖర్చులు తగ్గి, హెల్త్‌‌ పై ఖర్చులు పెరిగాయి. ప్రజలు కూడా ఇక నుంచి ఖరీదైన ప్రొడక్టులపై ఖర్చు తగ్గించి, చీప్‌ వస్తువులు కొనేందుకే మొగ్గుచూపుతారు. గూడ్స్‌‌ ను కూడా గుడ్ కాస్ట్స్, బాడ్ కాస్ట్స్‌‌ లుగా వర్గీకరించారు. గుడ్ కాస్ట్స్ అంటే డిజిటైజేషన్, టెక్ కాస్ట్స్, డిజిటల్ మార్కెటింగ్, బెస్ట్ ఎంప్లాయూస్. బాడ్ కాస్ట్స్ అంటే అనసరమైన ఖర్చులు. హోమ్ ఎడ్యుకేషన్, హోమ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, హోమ్ ఫిట్‌‌నెస్‌‌ వంటి వాటిల్లో డిజిటల్ ఎకానమీ ఫుల్‌‌గా పెరుగుతోంది. అయితే స్టేక్‌‌హోల్డర్స్ మధ్య నమ్మకం పోయింది. వెండర్లు, కస్టమర్లు, ఎంప్లాయిస్, బారోవర్స్, బ్యాంక్‌‌ల మధ్య నమ్మకం తగ్గిపోయింది. సప్లయిర్స్, ఎంప్లాయీస్‌‌తో ఓపెన్ కన్వర్జేషన్స్ ఉండాలి. ఈ కరోనా క్రైసిస్‌‌లో కూడా విన్నర్లు, లూజర్లు ఉంటారు. విన్నర్లు ఈ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తారు.   చైనాకు ఎదురుదెబ్బ తగలవచ్చు. దీన్ని ఇండియా ఈ అవకాశాన్ని వాడుకోవాలి.   కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌‌‌‌గా మారాలి. ఇండియాలోకి లిక్విడిటీ ఆకర్షించాలి.