నేను కూడా రైతునే.. ప్రభుత్వం ఫార్మర్స్‌‌ను బాధపెట్టదు

నేను కూడా రైతునే.. ప్రభుత్వం ఫార్మర్స్‌‌ను బాధపెట్టదు

న్యూఢిల్లీ: రాజ్య సభలో కేంద్రం వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టిన సమయంలో విపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరుపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ మండిపడ్డారు. రైతులను గందరగోళానికి గురి చేయాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలు డ్రామా చేశారన్నారు. తాను కూడా రైతునని చెప్పిన రాజ్‌‌నాథ్.. ప్రభుత్వం రైతులను బాధపెడుతుందని ఎప్పుడూ నమ్మొద్దన్నారు. హింసాత్మక రీతిలో ప్రవర్తించడం, కుర్చీలు ఎక్కడం, చెయిర్స్‌‌తోపాటు మైకులను విరగ్గొట్టడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘డిప్యూటీ చైర్మన్‌‌తో అలా వ్యవహరించడం బాధాకరం. ఆయన చెయిర్ దగ్గరకు వెళ్లి, రూల్‌‌బుక్‌‌ను చించి వేయడం సరికాదు. ఇలాంటి ఘటన రాజ్య సభ లేదా లోక్ సభ చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. సదరు నేతలు పార్లమెంట్ గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించారు’ అని రాజ్‌‌నాథ్ చెప్పారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త వ్యవసాయ బిల్లుల్లో కీలకమైన రెండు బిల్స్ రాజ్య సభలో మూజువాణి ఓటుతో ఆదివారం ఆమోదం పొందాయి. ఈ బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో వీటికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లారు. దీంతో క్రమశిక్షణ చర్యల కింద ఎనిమిది మంది సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.