రాష్ట్రంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ ‌జోన్లు ఇవే..

రాష్ట్రంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ ‌జోన్లు ఇవే..

క‌రోనా క్ర‌మంలో ఆయా జిల్లాల‌ను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు, వైరస్‌ వ్యాప్తి ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ విభజించింది. దీనిప్రకారం రెడ్‌ జోన్ లో 6 జిల్లాలు ఉండగా, ఆరెంజ్‌ జోన్ లో 18 జిల్లాలు, గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు ఉన్నాయి. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

రెడ్‌ జోన్ లోని జిల్లాలు: హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: నిజామాబాద్‌, జోగులాంబ గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, నారాయణపేట, ఆదిలాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, మెదక్‌, జనగాం, మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్‌, జగిత్యాల

గ్రీన్‌ జోన్ లోని జిల్లాలు: పెద్దపెల్లి, నాగర్ కర్నూల్‌, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి