61 ఏండ్లు పూర్తి అయితేనే రిటైర్మెంట్

61 ఏండ్లు పూర్తి అయితేనే రిటైర్మెంట్

సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడాన్ని సంతోషిస్తున్నామన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. రిటైర్మెంట్ ఏజ్ 61 ఏళ్లకు పెంచారన్నారు. CPS లో లక్ష ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. వారిలో ఎవరైన చనిపోతే రాష్ట్ర సర్కారే.. ఎక్స్ గ్రేషియా కూడా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ వారిని.. తెలంగాణకు తీసుకరావడం..ఇక్కడి వాళ్ళు ఏపీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటే.. పంపాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
 
చిరుద్యోగి కూడా 30శాతం పీఆర్సీ ఇవ్వడంతో పాటు రిటైర్మెంట్ ఏజ్ 61కి పెంచడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వంలో వున్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలనీ సీఎం సభలో ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ చేసేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.